Breaking News Live Telugu Updates: కొవిడ్‌ వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్‌

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 02 Oct 2023 05:11 PM
చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతి

సూపర్ మార్కెట్లో చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయబోతే షాక్ కొట్టి చిన్నారి మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కూతురు రుషిత (4)తో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్ళగా ఫ్రిడ్జ్ షాక్ కొట్టి చిన్నారి రుషిత ప్రాణాలు కోల్పోవడం విచారకరం. నాసిరకం ఫ్రిడ్జ్ వాడితే చిన్నారుల ప్రాణాల మీదకి వచ్చిదంటూ సూపర్ మార్కెట్ యజమానిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి లోకేష్ సైగచేస్తే, జైలు గోడలు బద్దలుకొట్టి చంద్రబాబును బయటకు తెస్తాం: అఖిల ప్రియ

లోకేష్ అన్న ఢిల్లీ నుంచి ఒక్క సైగ చేస్తే.. ఛలో రాజమండ్రి పిలుపు ఇస్తే... రాయలసీమ జనాల్ని తీసుకు వచ్చి జైలు గోడలు బద్దలు కొట్టి అయినా చంద్రబాబును బయటకు తీసుకు రావాలనే కోరిక ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nobel Prize 2023 In Medicine: కొవిడ్‌ వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్‌

Nobel Prize 2023 In Medicine:


వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. కొవిడ్‌19 ను ఎదుర్కొనేందుకు ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. స్వీడన్‌లోని స్టాక్‌ హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ టీమ్ సోమవారం ఈ ప్రకటన చేసింది. 

లోకేష్‌తోపాటు విచారణకు రండీ- నారాయమకు సీఐడీ నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 4 న నారా లోకేష్‌తోపాటు విచారణకు హాజరు కావాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...


31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు...


శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం...


నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,623 మంది భక్తులు...


తలనీలాలు సమర్పించిన 43,934 మంది భక్తులు...


నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు...

తెలుగు రాష్ట్రాల్లో పౌర హక్కుల సంఘం సానుభూతిపరుల నేతల ఇళ్లలో ఎన్ఐఎ సోదాలు 

తెలుగు రాష్ట్రాల్లో పలువురు  పౌర హక్కుల సంఘం సానుభూతిపరుల నేతల ఇళ్లపై ఎన్ఐఎ సోదాలు 


హైదరాబాద్, గుంటూరు,  తిరుపతి, నెల్లూరులలో ఏ కాలంలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు


హైదరాబాదులో భవాని, అడ్వకేట్ సురేష్ ఇంట్లో సోదాలు


ఆల్వాల్ లోని సుభాష్ నగర్ లో బంధుమిత్రుల సంఘం సభ్యులు ఇళ్లపై ఎన్ఐఏ దాడులు


నెల్లూరులో  పౌర హక్కుల ఉద్యమంలో పనిచేస్తున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు 
 
తిరుపతిలో క్రాంతి చైతన్య ఇంట్లో తనిఖీలు 


పొన్నూరులో రాజారావుని విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు. మావోయిస్టు సానుభూతి పరులని ఆరోపణలు. 


చీమకుర్తిలో దుడ్డు వెంకటరావు ఇంట్లో సోదాలు


విజయవాడ పూర్ణనందం పేటలో అడ్వకేట్ టి ఆంజనేయులు ఇంట్లో ముగ్గురు సభ్యుల NIA టీమ్ సోదాలు 

Background

టీడీపీ అధినేత  చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున నేడు (అక్టోబర్‌ 2న) ఆయన కుటుంబం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సోమవారం నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మహాత్ముడి బాటలోనే శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారు. 


టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నారా లోకేష్ తో పాటు ఈ దీక్షలో టీడీపీ పలువురు ఎంపీలు పాల్గొనబోతున్నట్లు సమాచారం. న్యాయం కోసం పోరాడే వాళ్లంతా తమకు మద్దతు తెలిపాలని లోకేష్ కోరారు. అక్రమంగా కేసులు బనాయించి ప్రజలకు మేలు చేసిన వారికి జైల్లో పెడతారనే భయం మొదలైతే ఎవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసం చేయరన్నారు.


గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. రాజమండ్రిలోని రేణుక రెసిడెన్సీలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతారు. అయితే దీక్ష ప్రారంభానికి ముందు భువనేశ్వరి మీడియాతో మాట్లాడనున్నారు. తమ దీక్షకు కారణం చెబుతూ, ఇలాంటి దీక్ష ఎందుకు అవసరమో భువనేశ్వరి వివరించారు. 


టీడీపీ శ్రేణులు సైతం దీక్ష..
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. 
పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు టీడీపీ నేతలు, ఆయన మద్దతుదారులు మద్దతు తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా తమ నేతను అన్యాయంగా కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. 


చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ అక్టోబరు 3 వాయిదా
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ మంగళవారానికి (అక్టోబరు 3) వాయిదా వేసింది. అక్టోబరు 3న పిటిషన్ కి సంబంధించి అన్ని విషయాలు వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. తొలుత ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం వద్దకు వెళ్లగా.. జస్టిస్ భట్టి ఈ పిటిషన్ పై వాదనలు వినడానికి ఒప్పుకోని సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని సీజేఐ వద్ద మెన్షన్ చేశారు. 


లోకేష్ కు నోటీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. 14వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని  నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో  ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు. అయితే తర్వాత ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు చెప్పారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేకపోతే.. నిందితుడిగానే ఉంచారా అన్నదానిపై స్పష్టత లేదు

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.