Breaking News Live: భర్తతో గొడవపడి ఆసుపత్రి పై నుంచి దూకిన గర్భిణీ 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 03 Feb 2022 04:48 PM

Background

తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా దిగొచ్చాయి.  మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,900 అయింది. 24 క్యారెట్ల...More

భర్తతో గొడవపడి ఆసుపత్రి పై నుంచి దూకిన గర్భిణీ 

హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ మెటర్నిటీ పెట్లా బురుజు ఆసుపత్రిలో ఓ గర్భిణీ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో తన భర్తతో గొడవ పడి ఆసుపత్రి భవనం పై నుంచి గర్భిణీ దూకింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఇటీవలే పెట్లా బురుజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ అడ్మిట్ అయ్యారు.  ఆసుపత్రిలో భర్తతో గొడవపడి మాటా మాటా పెరిగి భవనంపై నుంచి ఆమె దూకినట్లు సమాచారం. బాధితురాలిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.