ఆంధ్రప్రదేశ్‌లో  రాజకీయ వేట ప్రారంభమైందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహరావు అన్నారు. విశాఖలో అమిత్ షా సభ దిగ్విజయం సాధించిందని తెలిపారు. తొమ్మిది ఏళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో చేప్పామన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం ఇచ్చారని ఇలా విష ప్రచారాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వలు అసత్య ప్రచారాలు చేస్తోందని.. కేంద్ర సహయం పేరుతో బుక్ ముద్రించామన్నారు. దీనిని ఇంటింటికీ తీసుకెళ్లి కేంద్ర సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నిన్న వైసీసీ నాయకులు కేంద్రం ఏం చేసిందని అంటున్నారని.. ఏం చేసిందో పూర్తిగా తెలుసుకోండన్నారు. లేదంటే అబాసు పాలవుతున్నారని చెప్పుకొచ్చారు. విశాఖలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయన్నారు.



భూకుంభకోణంపై సిట్ వేసి ఎందుకు బయట పెట్టలేదు..


భూ కబ్జా దారులను జగన్ మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని జీవీఎల్ నర్సింహరావు మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలు కూడా భూ కుంభకోణంపై సిట్ వేసి బయట పెట్టలేదని ఆరోపించారు. భూ కబ్జాలో మీ వాటాలు ఎంతో చేప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇదే ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రి బీజేపీకి అండగా ఉండకపోవచ్చు  అన్న కామెంట్స్‌పై కూడా జీవీఎల్ స్పందించారు. బీజేపీ ఆయనకు అండగా ఉండదు ఆయనకే కాదు ఎవరికీ అండగా ఉండదని చెప్పారు.


తాము ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామన్నారు జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు సైతం అసత్య ప్రచారాలు చేస్తుండడం మానుకోవాలన్నారు. అవినీతిపై అమిత్ షా  వ్యాఖ్యలు నిజం కాకపోతే.. వాటిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని కోరండన్నారు.  కేంద్రం చేసిన సహయంపై పుస్తకాలు పంపిస్తామని చదువుకొని చర్చకు రావాలని పిలుపునిచ్చారు. తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. 


ఏపి అభివృద్ధికి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు జీవిఎల్. ఉపాధి హమీ పథకం కింద దేశంలోనే అత్యధికంగా 55వేల కోట్లు తీసుకున్న రెండో రాష్ట్రం ఏపీ అని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. నిధులు ఇవ్వడం ద్వారా ఏ రాజకీయ పార్టీకో మేలు జరుగుతుందనే అంచనాలతో విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బాయ్ కట్ చేసే పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయని జీవీఎల్ హెచ్చరించారు. 


రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది అసలు..!


వారహి యాత్ర దిగ్వజయం సాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో అవినీతిపరులపై చర్యలు తీసుకునే విధంగా కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగం ఉందన్నారు. అమిత్ షా ప్రసంగం చూసి వైసీపీ మంత్రులకు, నాయకులకు భయం మొదలైందని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సీఎం జగన్ కు ఏం చేసిందని.. దానిపై ఎవరైనా ఫిర్యాదు చేశారని అని అడిగారు. సీఎం జగన్ మీడియా సంస్థల విషయంలో పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ స్వార్థ పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటేనే వ్యాపారస్తులు భయపడుతున్నారని తెలిపారు. విశాఖకు ఒక్క ఐటీ పరిశ్రమ అయినా వచ్చిందా అని అడగారు. అలాగే సీఎం జగన్ మెప్పించడానికి అధికారులు ఆయనకు వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు.