Breaking News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.
KhageshLast Updated: 18 Sep 2025 08:27 PM
Background
Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మాన్సూన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కూడా వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు...More
Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మాన్సూన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కూడా వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అవుతున్నారు. మండలిలో మాత్రం సభకు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభంకానుంది. పది గంటలకు శాసన మండలి సమావేశమవుతుంది. రెండు సభలు కూడా ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ గ్యాప్‌లో బీఏసీ భేటీ జరుగుతుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి. ఏయే అంశాలు చర్చించాలనే అంశాలను నిర్ణయిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేనురాజు అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా చర్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025 ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వీటి స్థానంలో ఇప్పుడు బిల్లులు తీసుకురానుంది. వీటితోపాటు సూపర్-6 పీ-4, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు ఆహ్వానించే అంశాలు, మెగా డీఎస్సీ ఇలా పదికిపైగా అంశాలపై చర్చిస్తారు. ఇవాళ మంత్రిమండలి సమావేశం కానుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన తీరుపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. మండలిలో ప్రతిపక్షం వ్యూహాలపై కూడా మాట్లాడనున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి కూడా తన పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోయినా, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు. అందుకే మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. ఎలాంటి అంశాలను సభలో ప్రస్తావించాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తారు.
Rahul Gandhi: భారత్‌లో జెన్-Z ఉద్యమం వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశంలో ఓట్లను గల్లంతు చేసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆరోపించిన ఆయన దీనిపైనే యువత, విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. వారితో కలిసి రాజ్యాంగ పరిరక్షణకు పని చేస్తారనని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Air India: విశాఖ- హైదరాబాద్ విమానం ఇంజిన్‌లో ఇరుక్కున్న పక్షి- ఆకాశంలో టెన్షన్ టెన్షన్
Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ముప్పు తప్పింది. మధ్యాహ్నం 2.38 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయల్దేరిన వివిమానం ఇంజిన్‌లో పక్షి ఇరుక్కుంది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీన్ని గమనించిన పైలట్ జాగ్రత్తగా మళ్లీ ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన టైంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు.
Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ దంచి కొడుతున్న వానలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అర్ధరాత్రి వరకు చితక్కొట్టిన వాన ఇవాళ సాయంత్రం అయ్యేసరి మళ్లీ మొదలు పెట్టింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఇటు హయత్ నగర్ నుంచి అటు కూకట్పల్లి, పటాన్ చెరు వరకు హోరెత్తించింది. వాన ధాటికి రోడ్లు జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ నిలిచిపోయి జనం అవస్థలు పడుతున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉదయం నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు జనాలను హడలెత్తించింది. సాయంత్రానికి హైదరాబాద్ వాసులను బెంబేలెత్తించింది. వాన రాకతోనే హైడ్రా సిబ్బంది రోడ్లపైకి వచ్చారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.
Telangana CM Revanth Reddy Delhi Tour: సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy Delhi Tour: శుక్రవారం ఢిల్లీలో జరిగే ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడంతోపాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కేంద్రమంత్రులతో సమావేశం కాబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Andhra Pradesh Assembly Sessions: పదిరోజులపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
Andhra Pradesh Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పది రోజుల పాటు నిర్వహించారని బీఏసీ సమావేశంలో స్పీకర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. పది రోజుల్లో దాదాపు 18 అంశాలపై చర్చిస్తారు. పలు ఆర్డినెన్స్‌ను బిల్లుగా మారుస్తారు. ఈ సమావేశాల్లో 20, 21,28, సెలవు దినాలుగా ప్రకటించారు.
ED Raids in AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం- దేశవ్యాప్తంగా ఈడీ ఆకస్మిక తనిఖీలు
ED Raids in AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అడుగు పెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. సైలెంట్‌గా విచారణలోకి దిగిన ఈడీ చాలా రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లో కూడా 8 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో కూడా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
Deputy CM Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం- తొలిసారి మండలికి వచ్చిన నాగబాబు
Deputy CM Pawan Kalyan: జనసేన శాసన సభపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. మరోవైపు ఎమ్మెల్సీగా తొలిసారి నాగబాబు శాసన మండలి సమావేశానికి హాజరయ్యారు. అంతకంటే ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.
AP Mega DSC 2025: మెగా డీఎస్సీ నియామకపత్రాల అందజేసే కార్యక్రమం వాయిదా- త్వరలోనే కొత్త తేదీ వెల్లడి
AP Mega DSC 2025: భారీ వర్షాల కారణంగా మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడింది. అమరావతిలో ఈ నెల 19న జరగాల్సిన కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ప్రకటించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ తెలిపారు.
AP Mega DSC 2025: మెగా డీఎస్సీ నియామకపత్రాల అందజేసే కార్యక్రమం వాయిదా- త్వరలోనే కొత్త తేదీ వెల్లడి
AP Mega DSC 2025: భారీ వర్షాల కారణంగా మెగా డీఎస్సీ – 2025 నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడింది. అమరావతిలో ఈ నెల 19న జరగాల్సిన కార్యక్రమం వాయిదా వేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ప్రకటించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామని మెగా డీఎస్సీ కన్వీనర్ తెలిపారు.
Rahul Gandhi Press Meet: హైడ్రోజన్ బాంబు ఇంకా ముందుంది: రాహుల్ గాంధీ
Rahul Gandhi Press Meet: ఓట్ చోరీపై కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరిన్ని ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని అలంద్‌లో నకిలీ లాగిన్లను ఉపయోగించి 6,000 ఓట్లను తొలగగించాలని తెలియజేశారు. రాహుల్ ప్రెస్ మీటింగ్‌ను ప్రారంభించి, "మొదట, ఇది హెచ్-బాంబ్ కాదు, హెచ్-బాంబ్ వస్తోంది. ఈ దేశంలో ఎన్నికలు ఎలా రిగ్గింగ్ అవుతున్నాయో, ఓట్ చోరీ చేయడంలో ఇది మరొక మైలురాయి" అని అన్నారు.
Hyderabad Crime News: హైదరాబాద్ మీర్ పేటలో షూ షాప్‌లో ఘోర అగ్ని ప్రమాదం – లక్షల్లో నష్టం
Hyderabad Crime News: హైదరాబాద్ మీర్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెల్లగూడ మెయిన్ రోడ్డులో ఉన్న శ్రీశ్రీ ఫుట్‌వేర్ దుకాణంలో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్వాగత్ గ్రాండ్ బిల్డింగ్ సెల్లర్లో ఉన్న ఈ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు రూ.25 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.
ఉదయం 4:30 గంటల సమయంలో దుకాణం నుంచి మంటలు, పొగలు కనిపించడం స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికు సమాచారం అందుకున్న వెంటనే మీర్ పేట పోలీస్, ఫైర్‌సర్వీస్ సిబ్బంది రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని షాపు యజమాని శ్రీనివాస్ చెప్పారు.
అగ్నిమాపక అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ...“దుకాణంలో మండే స్వభావం ఉన్న పదార్థాలు అధికంగా ఉండటంతో మంటలు అదుపు చేయడంలో ఆలస్యమైంది. దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదు” అని తెలిపారు.
Andhra Pradesh Assembly Session: హడ్కో నిధులు రాగానే టిడ్కో ఇళ్ల బకాయిలు క్లియర్- గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
Andhra Pradesh Assembly Session: హడ్కో నిధుల విడుదలపై మంత్రి నారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ..." 2014-19లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించింది.వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం. గత ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించడమే కాకుండా...ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తవగా...మరో 112 చోట్ల పూర్తిచేయాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు,ఇళ్ల నిర్మాణం పూర్తికి మొత్తం 6139 కోట్లు కావాలి. 4500 కోట్లు రుణం ఇవ్వడానికి హడ్కో అంగీకరించింది. హడ్కో నిధులు విడుదల కాగానే బిల్లులన్నీ క్లియర్ చేస్తాం." అని మంత్రి నారాయణ ప్రకటించారు.
Andhra Pradesh Assembly Session ; ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గందరగోళం- వాయిదా తీర్మానాల తిరస్కరణపై వైసీపీ ఆందోళన
Andhra Pradesh Assembly Session ; ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. రైతు సమస్యలపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Andhra Pradesh Latest News:ప్రభుత్వం పాఠశాలలు, పంచాయతీ బిల్డింగ్స్‌పై సోలార్ ప్యానల్స్- మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
Andhra Pradesh Latest News: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. " రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5006.35 మెగావాట్లుగా ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్రం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ను తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 78.50 గిగావాట్లుకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. మోడల్ స్కూల్, కేజీబీవీ వసతి గృహాల్లో 2,138 KW సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేశాం. PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. PM SHRI పథకం ద్వారా 3,550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. పీఎం సూర్యఘర్ కు బ్యాంకర్లు మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. సూర్యఘర్ కు సహకరించాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్ల సమావేశం లో కోరారు. ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశాం. త్వరలోనే గ్రామస్థాయిలో పంచాయతీ భవనాలపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం భవనాలపై 130 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హులైన ఎస్సీ,ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తుంది. 2014-19 మధ్య కాలంలో 9 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్ట్రం సాధించింది. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థను సర్వ నాశనం చేసింది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుంచి తరిమేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని పెంచకుండా, 9 సార్లు చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసింది. " అని అన్నారు.
Kuppam Crime News: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం- భార్యను నరికి చంపిన భర్త- చెట్టు కట్టేసిన స్థానికులు
Kuppam Crime News: కుప్పంలో దారుణం జరిగింది. కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను అతికిరాతకంగా మొచ్చుతో నరికి చంపాడు భర్త. బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్‌తో సుమారు రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన కీర్తన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఏమి జరిగిందో తెలియదు గాని భర్త రాజేష్ అతి కిరాతకక కీర్తనపై కత్తితో దాడి చేశాడు. దీని గమనించిన స్థానికులు అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారైన రాజేష్ సమీపంలోని ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందు ప్రయత్నించాడు. స్థానికులు అతన్ని పట్టుకుని చెట్టు కట్టి వేశారు. స్థానికులు హుటాహుటిన కీర్తనను కుప్పం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పిఎస్ ఆసుపత్రికి తరలించారు.