Weather Update:తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముందస్తుగా రుతుపవనాలు వచ్చినప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు పడటం లేదు. రుతుపవనాలు ఒక్కసారిగా మందగించడంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలు రుతుపవనాలు వచ్చాయా అని ప్రశ్నించుకునే స్థితికి వాతావరణం చేరుకుంది. కానీ మంగళవారం నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వస్తున్న మార్పులు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి.  

తెలంగాణలో వాతావరణంతెలంగాణ ప్రస్తుతం పలు చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గత కొన్ని రోజలుగా విపరీతమైన ఉక్కపోత, ఎండతో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ వాతావరణం కాస్త ఆహ్లాదాన్ని పంచుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షం అవకాశం ఉంది. ప్రస్తుతం మేఘావృతమైన వాతారణం కారణంగా  ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.హైదరాబాద్‌లోని మంగళ్‌హట్ ప్రాంతంలో ఈ ఉదయం ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. తేమ 77 శాతం ఉంది.  హైదరాబాద్‌లో ప్రస్తుతానికి వర్షాలు లేకపోయినా సాయంత్రానికి కల్లా వర్షాలు పడేే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.   

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణంఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు కాస్త ఉపశనం పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో కూడా మేఘావృతం ఎక్కువగా ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల నుంచి 34 డిగ్రీల మధ్యే ఉంటుందని చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, కడప, నెల్లూరు వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.  

వివిధ ప్రాంతాల్లో వాతావరణ ఎలా ఉంటుంది?హైదరాబాద్: రోజంతా మేఘావృతమై ఉంటుంది. తేమ ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత 26-32 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది.  

విజయవాడ: రోజంతా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 28-34 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. మధ్యాహ్నం తర్వాత వర్షం కురుస్తుందని అంచనా ఉంది. 

విశాఖపట్నం: మేఘావృతం ఉండటం వల్ల ఉష్ణోగ్రత 27-32 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి.  

తిరుపతి: మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రత 26-33 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. వర్షం పడే అవకాశం ఉంది.  రుతుపవనాలు చురుగ్గా మారడంతో మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షాల్లో వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావం బుధవారం కూడా కంటిన్యూ అవుతాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వానలు జోరు అందుకుంటాయని అంచనా వేస్తున్నారు. 

తుపాను సూచనలుతెలుగు రాష్ట్రాల్లో బుధవారం మొత్తం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. తుపాను సూచనలు లేవు కానీ, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో మాత్రం పరిస్థితులు మారుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ తేమ కారణంగా ఉక్కపోత ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల జనానికి అసౌకర్యం కలుగుతుంది. 

ఈ వారమంతా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుంది. గురువారం (జూన్ 12) ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. శుక్రవారం (జూన్ 13) మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. శనివారం (జూన్ 14), ఆదివారం (జూన్ 15) కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి.  సోమవారం (జూన్ 16) అక్కడక్కడ గాలివానకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.