Anantapur Fire Accident News: అనంతపురం నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ దారిలో ఉన్న ఓటైర్ల దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల సమీపంలో సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తెల్లవారుజామున జరగటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే టైర్ల షాపులో మంటలు భారీగా ఎగసి పడుతుండడంతో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది.
అక్కడ ఉన్న స్థానికులు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.