Anant Ambani Radhika Merchant Wedding Guests: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వెడ్డింగ్ వేడుకలకు (anant ambani radhika merchant wedding) అంతా సిద్ధమవుతోంది.ఇప్పటికే సంగీత్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్ తారలంతా ఈ ఈవెంట్‌కి క్యూ కట్టారు. అంబానీ కుటుంబంతో కలిసి స్టెప్పులేశారు. జస్టిన్ బీబర్ షో హైలైట్‌గా నిలిచింది. జులై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఒక్కటి కానున్నారు. జులై 12-14 వరకూ ఈ వేడుకలు ఇంతే ఘనంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే మూడు రోజుల పాటు ఏయే ఈవెంట్స్ జరుగుతాయో అంబానీ ఫ్యామిలీ (Anant Ambani, Radhika Merchant’s Sangeet) ప్రకటించింది. స్పెషల్ కార్డ్ తయారు చేయించి గెస్ట్‌లకు పంపించింది. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది.
అయితే...ప్రీవెడ్డింగ్, సంగీత్ ఈవెంట్స్‌కే బాలీవుడ్‌లోని ప్రముఖులందరినీ (Anant Ambani, Radhika Merchant Wedding Guests List) ఆహ్వానించింది అంబానీ కుటుంబం. ఇక పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలి రానున్నారు. ఈ లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్, ఖాన్, ఆమీర్ ఖాన్ ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ జులై 12న జరిగే వెడ్డింగ్‌కి హాజరు కానున్నారు. ఇప్పటికే వీళ్లంతా సంగీత్ ఈవెంట్‌లో కనిపించారు. వీళ్లతో పాటు మరికొందరు బాలీవుడ్ తారలూ పెళ్లికి రానున్నారు. కరణ్ జోహార్, కరీనా కపూర్, జాహ్నవీ కపూర్, కరిష్మా కపూర్, సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, అనన్యా పాండేతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీకి ఆహ్వానం అందింది.
సౌత్ స్టార్స్ సంగతేంటి..?
వెడ్డింగ్‌కి సౌత్ నుంచి ఎవరిని పిలుస్తున్నారన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే..ప్రీవెడ్డింగ్ వేడుకల్లో మాత్రం కొంత మంది దక్షిణాది సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో పాటు రామ్ చరణ్, ఉపాసనా కొణిదెల, అత్లీ దంపతులు, సింగర్ హరిహరన్ ఈ ఈవెంట్‌కి వెళ్లారు. వెడ్డింగ్‌కి కూడా వీళ్లు హాజరయ్యే అవకాశముంది. వీళ్లతో పాటు మరికొందరు సౌత్ స్టార్స్‌కీ ఆహ్వానం అందిందా అన్నది చూడాలి.
రాజకీయ అతిథులు..
జులై 12న జరగనున్న వివాహానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఆయనతో పాటు సోనియా గాంధీకి ముకేశ్ అంబానీ ఆహ్వానం అందించారు. స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. తప్పకుండ పెళ్లికి రావాలని కోరారు. అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేనీ ముకేశ్ అంబానీ ఆహ్వానించారు. అయితే..వీళ్లలో ఎంత మంది వస్తున్నారన్నది ఇంకా కన్‌ఫమ్ కాలేదు. ప్రస్తుతానికైతే పెళ్లి ఏర్పాట్లు చాలా జోరుగా కొనసాగుతున్నాయి.