Stock to Buy: అమెరికన్‌ బ్యాంకింగ్ పరిశ్రమలో సంక్షోభం కారణంగా చాలా ఇండియన్‌ ఈక్విటీలు బొక్కబోర్లా పడ్డాయి. ఇలాంటి పరిస్థితలను తట్టుకుని నిలబడగల విన్నింగ్‌ స్టాక్స్‌ కోసం పెట్టుబడిదార్లు స్టాక్ మార్కెట్‌ను జల్లెడ పడతున్నారు. కొనసాగుతున్న అనిశ్చితిని తట్టుకుని, మార్కెట్ పుంజుకున్నప్పుడు వేగంగా వృద్ధి చెందగల కంపెనీలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. 


కొందరు ఎనలిస్ట్‌లు అలాంటి ఘనాపాఠి స్టాక్స్‌ను ట్రాక్‌ చేస్తూ, "బయ్‌" సిఫార్సు చేస్తున్నారు. వాటి నుంచి 15 స్టాక్స్‌ను ఏరి, ఆ లిస్ట్‌ను కింద ఇస్తున్నాం. బ్లూంబెర్గ్ లెక్క ప్రకారం.. కనీసం 20 మంది ఎనలిస్ట్‌ల కవరేజ్‌లో ఈ కౌంటర్లు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే ఒక సంవత్సర కాలంలో 13% నుంచి 50% మధ్య రాబడిని ఇచ్చే అవకాశం ఉంది.


ICICI బ్యాంక్, SBI లైఫ్‌, హిందాల్కో
ఉదాహరణకు.. ICICI బ్యాంక్ స్టాక్‌ను ట్రాక్ చేస్తున్న 53 మంది విశ్లేషకుల్లో 51 మంది "బయ్‌" రేటింగ్‌ ఇచ్చారు. ఆ కౌంటర్‌ ప్రస్తుత ధర ₹826 గా ఉంటే, రూ. 1,117 టార్గెట్‌ ధర ప్రకటించారు.


SBI లైఫ్‌ను ట్రాక్‌ చేస్తున్న 34 మంది విశ్లేషకుల్లో 33 మంది "బయ్‌" రేటింగ్‌, ₹1,559 టార్గెట్ ధర ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఇది 46% ఎక్కువ. 


హిందాల్కోను ట్రాక్ చేస్తున్న మొత్తం 24 మంది విశ్లేషకులు, ప్రస్తుత ధర ₹406తో పోలిస్తే ₹534 టార్గెట్ ధరతో "బయ్‌" సిఫార్సు చేశారు.


ఇవి కాకుండా... ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్, బిర్లా కార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, అపోలో హాస్పిటల్స్‌, HDFC, అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్‌, ITC, NTPC కౌంటర్లను దలాల్ స్ట్రీట్‌ ఎనలిస్ట్‌లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 


ICICI బ్యాంక్, SBI లైఫ్‌, హిందాల్కో కాకుండా మిగిలిన 12 కంపెనీలకు విశ్లేషకులు ఇచ్చిన సిఫార్సులు ఇవి:


ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 19
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 50%


బిర్లా కార్ప్
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 19
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 44%


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 49
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 39%


యాక్సిస్ బ్యాంక్
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 49
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 36%


ఫెడరల్ బ్యాంక్
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 35
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 34%


HDFC బ్యాంక్
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 41
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 25%


గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 22
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 25%


అపోలో హాస్పిటల్స్‌
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 23
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 22%


HDFC
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 25
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 20%


అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్‌
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 21
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 18%


ITC
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 36
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 14%


NTPC
బయ్‌ రేటింగ్‌ ఇచ్చిన ఎనలిస్ట్‌ల సంఖ్య: 24
ప్రస్తుత స్థాయి నుంచి ఎంత ర్యాలీకి అవకాశం: 13%


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.