CBSE Results:
భవిష్యత్‌లో ఎన్నో సాధిస్తారు..
సీబీఎస్‌ఈ 10,12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ఆశించిన విధంగా రిజల్ట్స్ రాలేదని బాధ పడే విద్యార్థులను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు. "కొందరు విద్యార్థుల తమ ఫలితాల విషయంలో ఆనందంగా ఉండకపోవచ్చు. కానీ..ఓ విషయం గుర్తుంచుకోండి. ఒకే ఒక ఎగ్జామ్‌తో మీరేంటన్నది డిసైడ్ అయిపోదు. భవిష్యత్‌లో మీరెన్నో విజయాలు సాధిస్తారు. ఈ ఏడాదిలో పరీక్షా పే చర్చలో జరిగిన చర్చనూ ఈ సందర్భంగా షేర్ చేస్తున్నాను" అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవుతారు, దాన్ని అధిగమించటానికి ఏం చేయాలని సూచనలు చేస్తూ ఈ ఏడాది పరీక్షా పే చర్చలో మాట్లాడారు ప్రధాని. పరీక్షల భయాన్ని పోగొట్టుకోవాలని ఆ సమయంలో విద్యార్థులకు సూచించారు. "మీరు నేర్చుకోని విషయాల గురించి ఆలోచించి బాధ పడకండి. ఒత్తిడి తీసుకోకండి. మీ బలాలేంటో వాటిపై దృష్టి పెట్టండి. చివరి నిముషం వరకూ హర్రీబర్రీగా ఉండకండి. వేరే వాళ్లను అనుకరించే ప్రయత్నం
చేయకండి. పరీక్షల్ని పండుగలా భావించి హాజరవ్వండి" అని చెప్పారు ప్రధాని మోదీ.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12 వ తరగతి ఫలితాలు విడుదల చేసింది. ఇందులో బాలుర కంటే బాలికలు 1.4% ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. క్లాస్ 12లో ఓరాల్ పాస్ పర్సంటేజ్ 92.71%కాగా, 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ 94.4%గా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.