Amritpal Singh News:
ఈ ఫిబ్రవరిలో పెళ్లి..
అమృత్ పాల్ సింగ్‌పై నిఘా వర్గాల రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ గడిపే వాడని, థాయ్‌లాండ్‌కు తరచూ వెళ్లొచ్చే వాడని వెల్లడైంది. భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను హౌజ్ అరెస్ట్ చేశాడని, తీవ్రంగా కొట్టేవాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరికీ వివాహమైంది. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూనే ఉన్నాడని చెప్పాయి. అమృత్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ పోలీసులు అమృత్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను ప్రశ్నించారు. Waris Punjab De పార్టీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో విచారించారు. ఈ నెల 18న అమృత్ పాల్‌ను అరెస్ట్ చేసేందుకు ఆపరేషన్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. ఈ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లో మరి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రిపోర్ట్‌లోని అంశాలివే..
1. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిరణ్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు అమృత్ పాల్ సింగ్. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించాడు. కిరణ్‌దీప్ పంజాబ్‌లోనే పుట్టినా...ఆమె యూకేలో సెటిల్ అయ్యారు.
2. అమృత్ పాల్ ఎప్పుడూ ఎవరితోనూ తన గతం గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడేవాడు. 2002 వరకూ దుబాయ్‌లోనే ట్రక్ డ్రైవర్‌గా పని చేశాడు. ఇక్కడికి వచ్చిన వెంటనే రాజకీయాల్లోకి దిగిపోయాడు. వారిస్ పంజాబ్ దే పార్టీ చీఫ్‌గా ఎదిగాడు.
3. అమృత్ పాల్ తరచూ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. మరో సంచలన విషయం ఏంటంటే...అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసినట్టు అనుమానాలున్నాయి. అంతే కాదు. అక్కడ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టూ తెలుస్తోంది.
4. భారత్‌లో ఉన్నప్పుడు సిక్కు సంప్రదాయాలు పాటించే అమృత్ పాల్...విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం వాటిని పట్టించుకోడు.
5. దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తూనే డ్రగ్ డీలర్స్‌తో లింక్స్ పెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే జస్వంత్ సింగ్ అనే ఓ డ్రగ్ డీలర్‌తో పరిచయం ఏర్పడింది. పాకిస్థాన్ నుంచి వీళ్లు డ్రగ్స్‌ను సప్లై చేస్తున్నారు.
అక్రమ సంబంధాలు..
ఈ కేసు విచారణలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమృత్ పాల్ సింగ్ కొంత మంది అమ్మాయిలతో ఛాట్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. వీరిలో పెళ్లైన మహిళలూ ఉన్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే...వీరిలో కొంత మందిని బ్లాక్‌మెయిల్ కూడా చేశాడు. అమృత్ పాల్ సింగ్ ఛాట్, వాయిస్ నోట్స్‌ను పరిశీలించిన పోలీసులు..ఈ విషయం వెల్లడించారు. కొన్ని వాయిస్ నోట్స్‌లో "నాకు క్యాజువల్ రిలేషన్ అంటేనే ఇష్టం. మరీ అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అమ్మాయిలు ఎందుకింత తొందరగా సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి దిగిపోతారు" అని ప్రశ్నించినట్టుగా ఇండియా టుడే వెల్లడించింది. ఇదే సమయంలో మరో మహిళకు ఓ వాయిస్ నోట్ పంపినట్టు తెలిపింది. అందులో "నాకు సమస్యగా మారనంత వరకూ ఏ మహిళతో అయినా అఫైర్ పెట్టుకోవడానికి రెడీయే" అని అన్నాడు అమృత్ పాల్. ఇంతే కాదు. సోషల్ మీడియాలోనూ మహిళలతో ఛాటింగ్ చేసినట్టు ఆధారాలున్నాయి. "మన రిలేషన్ షిప్ కుదిరిందిగా. హనీమూన్‌కు దుబాయ్ వెళ్దాం" అని మెసేజ్‌లు పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read: Rahul Disqualification: రాహుల్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? న్యాయ పోరాటం ఫలిస్తుందా?