TMC Mahua Moitra Hate Speech: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అమిత్ షాపై తీవ్ర అభ్యంతరకర పదజాలం వాడారు. ఆయన తల తీసి టేబుల్ మీద పెట్టాలని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లోని నదీయా జిల్లాలో అక్రమ చొరబాటు సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో అక్రమ చొరబాటు దేశ జనాభాను మార్చుతోందని అన్నారు. దీనిని గుర్తు చేసిన మహువా బెంగాల్‌లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటు పెరిగిపోతోందని ..దీనికి హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. ఆయన తల తీసిటేబుల్ పై పెట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"బార్డర్లు రక్షించలేకపోతే, మరో దేశం నుంచి లక్షలాది మంది చొరబాటు చేస్తున్నారు... మా భూములు ఆక్రమిస్తున్నారు... మొదట అమిత్ షా తలను నరికి మీ టేబుల్ మీద పెట్టాలి." అని ఆవేశంగా వ్యాఖ్యానించారు. మహువా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతున్నారని బీజేపీ మండిపడింది.
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయంగా ఓడించాలి కానీ.. హింసను ప్రేరేపించకూడదన్నారు. ఆమె ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు.
తాను అన్న వ్యాఖ్యలపై మహువా మొయిత్రా విభిన్నంగా స్పందించారు. అది బీజేపీ సోషల్మీడియా చేసిన మ్యానిపులేషన్ అన్నట్లుగా ట్వీట్ పెట్టారు.
బీజేపీపై దూకుడుగా విమర్శలు చేసే ఎంపీ ఇలా వ్యాఖ్యానించడం రాజకీయంగానూ దుమారం రేపుతోంది.