Amazon LayOffs: 



లేఆఫ్‌లపై సీఈవో వ్యాఖ్యలు 


ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. ఫేజ్‌ల వారీగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనిపై అమెజాన్ సీఈవో యాండీ జాసీ (Andy Jassy) స్పందించారు. షేర్‌ హోల్టర్‌లందరికీ ఓ లెటర్ రాశారు. కంపెనీ ఛాలెంజింగ్ ఫేజ్‌ను ఎదుర్కొంటోందని చెప్పారు. ప్రస్తుతం కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా తీసుకుంటున్న చర్యలు కంపెనీ గ్రోత్‌కి హెల్ప్ అవుతాయని భావిస్తున్నట్టు లెటర్‌లో రాశారు యాండీ జాసీ. ఇదే లెటర్‌లో లేఆఫ్‌ల గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకూ లక్షలాది మందిని తొలగించి కంపెనీ ఇటీవలే మరో 27 వేల మందిని ఫైర్ చేయనున్నట్టు ప్రకటించింది. దీనిపై స్పందించిన యాండీ జాసీ ఈ నిర్ణయం కఠినమైందే అయినా తప్పడం లేదని అన్నారు. భవిష్యత్‌లో కంపెనీకి ఇది మేలు చేస్తుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 


"కొన్ని నెలలుగా కంపెనీ ఎన్నో సవాళ్లు దాటుకుంటూ వస్తోంది. బిజినెస్ పరంగా నిలదొక్కుకోగలమా అని కంగారు పడ్డాం. లాంగ్‌ రన్‌లో కంపెనీని నడపగలమా లేదా అని మమ్మల్ని మేమే ప్రశ్నించుకున్నాం. పెట్టిన పెట్టుబడులు తిరిగొస్తాయా అని అనుమానించాం. ఈ సందేహాల మధ్య కొన్ని బుక్‌స్టోర్స్‌ను మూసేయాల్సి వచ్చింది. అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ స్టోర్‌లనూ క్లోజ్ చేశాం. ఎక్కడ డబ్బులు ఖర్చు చేయాలో తెలుసుకున్నాం"


- యాండీ జాసీ, అమెజాన్ సీఈవో 


డబ్బులు ఆచితూచి ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నామని, అందుకే లేఆఫ్‌లు చేయక తప్పలేదని స్పష్టం చేశారు యాండీ. ఏం చేసినా అది బిజినెస్‌కు ప్లస్ అయ్యే విధంగానే చేశామని వెల్లడించారు. 


"ఎక్కడ ఖర్చు చేయాలో తెలుసుకున్నాం. వాటికే ముందుగా ప్రాధాన్యతనిస్తున్నాం. ఈ కారణంగానే 27 వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించాల్సి వస్తోంది. మా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కొన్ని నెలలుగా పలు చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ లేఆఫ్‌లు ప్రకటించాం. ఇకపై ఎప్పటికప్పుడు మా కంపెనీ బిజినెస్‌ని ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి క్యాష్‌ రూపంలో కన్నా స్టాక్‌ల రూపంలో పరిహారం అందించాలని చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాం. ఈ ఫీల్డ్‌లోనే పెట్టుబడులు పెంచుతున్నాం"


- యాండీ జాసీ, అమెజాన్ సీఈవో 


గతంలోనే ప్రకటన..


గతంలోనే అమెజాన్ సీఈవో యాండీ జాసీ "భారీ లేఆఫ్‌లు" ఉంటాయని వెల్లడించారు. కానీ..ఎంత మందిని తొలగిస్తున్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. సీనియర్ పొజిషన్‌లో ఉన్న వారినే "ఫైర్" చేయనుంది అమెజాన్. ఉద్యోగులక పనితీరుని సమీక్షించాలని..ఇప్పటికే మేనేజర్లకు ఆదేశాలందాయి. ఈ రివ్యూ అయిపోయిన వెంటనే...లేఆఫ్‌లు మొదలు కానున్నాయి. కార్పొరేట్ స్టాఫ్‌లో 6% మందిని తొలగించనున్నారు. కార్పొరేట్ స్టాఫ్‌లో కొంత మందికి ఇప్పటికే "లేఆఫ్‌" కు సంబంధించిన సమాచారం ఇచ్చేశారు. వార్త తెలిసినప్పటి నుంచి ఉద్యోగులందరిలోనూ టెన్షన్ మొదలైంది. నిజానికి...ఫలానా విభాగంలోనే ఉద్యోగులను తొలగించాలన్న నియమం ఏమీ పెట్టుకోలేదు అమెజాన్. ఎక్కడ వర్క్‌ఫోర్స్ అనవసరం అనుకుంటే...అక్కడ తొలగించుకుంటూ వెళ్లనుంది.  


Also Read: Most Influential People: ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల్లో రాజమౌళి, ఎలాన్‌ మస్క్‌కూ లిస్ట్‌లో చోటు