Ahmedabad London Flight Crash Cause: భారతదేశ విమానయాన చరిత్రలో పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ను చెప్పుకోవచ్చు. విమానం కూలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం మాత్రం ఏవియేషన్ నిపుణుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. గాల్గోకి గాలి పటం ఎగిరిన తర్వాత ఒక్క సారిగా దారం తెగిపోతే గాలిపటం ఎలా ఫ్లాట్ గా వెళ్లి క్రాష్ అవుతుందో.. అచ్చంగా విమానం కూడా అలాగే కూలిపోయింది. అలా జరగడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయన్న దానిపై నిపుణులు రకరకాల అభిప్రాయాలు చెబుతున్నారు.
విద్రోహ చర్యకు అవకాశాలు అతి తక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒక వేళ విద్రోహ చర్య అయితే.. ప్లైట్ గాల్లో పేలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన వెంటనే సాంకేతిక తప్పిదం ఏదైనా జరిగి ఉంటేనే ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఎక్కువ మంది విమాన యాన రంగ నిపుణులు చెబుతున్నారు. విమానం ల్యాండ్ కావడానికి ముందు ఎలాంటి పేలుడు జరగలేదని.. కేవలం విమానం నేలను తాకిన తర్వాతనే మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ విమానంలో 232–244 మంది వ్యక్తులు ఉన్నారు: 230 పెద్దలైన ప్రయాణీకులు, ఇద్దరు చిన్న పిల్లలు, పన్నెండు మందిస క్యాబిన్ క్రూ ఉన్నారు. ఈ పిమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఎంత మంది బతికి బయటపడతారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అహ్మాదాబాద్ ప్రమాదంపై కేంద్రం కూడా వెంటనే స్పందించింది. ప్రమాదానికి కారణాలేమిటన్నదాదనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆరా తీయడం ప్రారంభించాయి.