Ahmedabad Astrologer Predicted 2025 Flight Crash Last Year: దేశంలో విమానయానరంగం అభివృద్ధి చెందుతున్నా.. ప్రమాదాలు జరుగుతాయని ఓ జ్యోతిష్యురాలు గత ఏడాది చెప్పిన జ్యోతిషం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆస్ట్రో శర్మిష్ఠ అనే జ్యోతిష్యురాలు ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

విమానయాన రంగం 2025లో మెరుగ్గా పనిచేస్తుంది, అయితే విమాన ప్రమాదాల  మనల్ని షాక్‌కు గురిచేయవచ్చునని  ట్వీట్ చేశారు. ప్రస్తుత ప్రమాదాన్ని తాను రెండ  క్రితం ఊహించానని తన పాత ట్వీట్ ను రీట్వీట్ చేసారు.  గురు గ్రహం మిథున రాశిలోని మృగశిర , ఆర్ద్ర నక్షత్రాలలో నెలకు సుమారు 6.5 డిగ్రీల వేగంతో ఉన్నప్పుడు, విమానయానం వృద్ధి చెందుతుంది, కానీ భద్రత, సురక్షితత లోపిస్తాయని ఆమె చెబుతున్నారు.  

 Astro Sharmistha పే గుజరాత్ లో ఉన్న  ప్రముఖ వేద జ్యోతిష్యురాలు.  గత 10 సంవత్సరాలకు పైగా వేద జ్యోతిష్యంలో అనుభవం కలిగి ఉంది మరియు కెరీర్, వ్యాపారం, ఆర్థికం, ప్రేమ, విద్య, ఆస్తి, వ్యక్తిగత విషయాలు, వివాహం, భాగస్వామ్యం ,  జీవిత రీడింగ్‌ల వంటి అనేక రంగాలలో వ్యక్తులకు మార్గదర్శనం చేస్తున్నట్లుగా చెప్పుకుంది.  

పాకిస్తాన్ లో 2025లో అత్యంత గడ్డు పరిస్థితులు ఉంటాయని ఆమె గత ఏడాది చెప్పారు. ఈ ఏడాది ఉద్రిక్త పరిస్థితులు చెప్పడంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. 

 ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేశారని పలువురు నెటిజన్లు ఆమెను అభినందస్తున్నారు.