Air India crash victims family welfare trust: భారతదేశ విమానయాన చరిత్రలో అతి పెద్ద ప్రమాదంగా చరిత్రకెక్కిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతులు, బాధితుల కోసం ఎయిరిండియా యాజమాన్యం అయిన టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (విమానం AI-171) బాధితుల కుటుంబాలకు మద్దతు అందించేందుకు టాటా సన్స్ 'ది AI-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్'ను ఏర్పాటు చేసి, దానిని అధికారికంగా రిజిస్టర్ చేసింది.
ఆయా కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఇస్తారు. అలాగే దీర్ఖకాలంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి, ఇతర బాధితులకు తక్షణ , దీర్ఘకాలిక సహాయం అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. టాటా సన్స్ , టాటా ట్రస్ట్‌లు కలిసి రూ. 500 కోట్లు ఈ ట్రస్ట్ కోసం కేటాయించాయి. ఈ నిధులు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, గాయపడినవారి వైద్య ఖర్చులు, దీర్ఘకాలిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు.
ఈ ట్రస్ట్‌ను ఐదుగురు సభ్యుల బోర్డ్ నిర్వహిస్తుంది. టాటా సంస్థలో ఉన్నతాధికారి ఎస్. పద్మనాభన్ , టాటా సన్స్ జనరల్ కౌన్సెల్ సిద్ధార్థ్ శర్మలను ప్రస్తుతానికి నియమించారు. మిగిలిన ముగ్గురు ట్రస్టీల త్వరలో నియమిస్తారు. ట్రస్ట్ బాధితులకు నేరుగా సహాయం అందించడంతో పాటు, దీర్ఘకాలిక సంక్షేమాన్ని చూసుకుంటుంది. టాటా సన్స్, ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత వెంటనే మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. అదనంగా, ఎయిర్ ఇండియా రూ. 25 లక్షల తాత్కాలిక సహాయాన్ని ప్రకటించింది గాయపడిన వారి వైద్య ఖర్చులను టాటా సన్స్ భరిస్తుందని ప్రకటించింది. ప్రమాదంలో ధ్వంసమైన B.J. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల పునర్నిర్మాణానికి టాటా గ్రూపు నిధులు ఇస్తుంది.
2025 జూన్ 12న, ఎయిర్ ఇండియా విమానం AI-171 (బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్) అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన 30 సెకన్లలోపు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 230 మంది ప్రయాణికులలో 229 మంది, 12 మంది సిబ్బంది, మరియు భూమిపై 19 మంది మరణించారు, మొత్తం 260 మందికి పైగా మరణాలు సంభవించాయి. అహ్మదాబాద్‌లోని B.J. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం రెండు ఇంజన్లు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు 'RUN' నుండి మారడం వల్ల థ్రస్ట్ కోల్పోయాయని తెలిపింది. పూర్తి నివేదిక తర్వాత అసలు కారణం బయటపడనుంది.