AIASL Recruitment: విజయవాడలోని ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్/హ్యాండీ వుమెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, సంబంధిత విభాగాలలో డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లీషు మాట్లాడటం, రాయటం వచ్చి ఉండాలి. సరైన అర్హతలు ఉన్నవారు మార్చి 16వ తేదీన ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 15


⏩ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన 3 సంవత్సరాల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్) లేదా ఐటీఐతో పాటు 3 సంవత్సరాలు ఎన్‌సీటీవీటీ సర్టిఫికేట్ (మోటార్ వెహికల్ ఆటో ఎలక్ట్రికల్/ ఎయిర్ కండిషనింగ్/ డీజిల్ మెకానిక్/ బెంచ్ ఫిట్టర్)/ వెల్డర్(ఎన్‌సీటీవీటీతో కూడిన ఐటీఐ – డైరెక్టరేట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ నుండి జారీ చేయబడిన సర్టిఫికేట్ అండ్ ఒక సంవత్సరం అనుభవంతో ఏదైనా రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వ శిక్షణ) హిందీ/ ఆంగ్లం/ స్థానిక భాష ఒక సబ్జెక్టుతో ఎస్‌ఎస్‌సీ/తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ట్రేడ్ టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో అభ్యర్థి తప్పనిసరిగా ఒరిజనల్ వాలిడ్ హెవీ మోటార్ వెహికల్ (HMV)ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.


వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.


జీతం: రూ.s.24,960.


⏩ హ్యాండీమ్యాన్/హ్యాండీ వుమెన్ పోస్టులు: 13 పోస్టులు


అర్హత: ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లాంగ్వేజ్ చదివి అర్థం చేసుకోగలగాలి. స్థానిక మరియు హిందీ భాషలపై పట్టు ఉండాలి.


వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.


జీతం: రూ.18,840.


దరఖాస్తు ఫీజు: రూ.500. “AI AIRPORTSERVICES LIMITED.” ముంబయి పేరిట డీడీ తీయాలి. అభ్యర్థుల పూర్తి పేరు & మొబైల్ నంబర్‌ను డిమాండ్ డ్రాఫ్ట్ వెనుకవైపు రాయాలి. ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.  


దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారమ్‌తో పాటుగా పూరించిన & టెస్టిమోనియల్‌లు/సర్టిఫికేట్‌ల కాపీలు(ఈ నోటిఫికేషన్‌తో జతచేయబడిన దరఖాస్తు ఫార్మాట్‌తో పాటుగా ఇంటర్వ్యూ జరుగు తేదీ, సయయంలో పర్సనల్‌గా అందచేయాలి.


ఎంపిక విధానం: 


1. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్..


➥ ట్రేడ్ టెస్ట్ అనేది హెవీ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ టెస్ట్‌తో సహా ట్రేడ్ నాలెడ్జ్ మరియు డ్రైవింగ్ టెస్ట్‌ను కలిగి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఇంటర్వ్యూకు పంపబడతారు.


➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


➥ ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.


2. హ్యాండీమ్యాన్ / హ్యాండీ వుమెన్..


➥ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ వంటివి). కేవలం ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పంపుతారు. 


➥ పర్సనల్/వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా.


➥ ఎంపిక ప్రక్రియ అదే రోజు లేదా తదుపరి రోజు ఉంటుంది.


వాక్ ఇన్ వేదిక: 
NTR College of VeterinaryScience. 
Opposite to Vijayawada InternationalAirport, 
Gannavaram, Krishna district
Andhra Pradesh - 521101.


వాక్-ఇన్ తేదీ & సమయం: 16.03.2024(09:00 గంటల నుంచి 12:00 గంటల వరకు)


Notification


Website