Breaking News Telugu Live Updates: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 18 Jun 2022 08:03 PM
పట్టపగలే అత్యంత దారుణంగా స్నేహితుడి తండ్రిని హత్య చేసిన యువకుడు

చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలం, పెద్దకంపల్లిలో ఓ యువకుడు పట్ట పగలే ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపాడు.. అదే గ్రామానికి చేందిన శ్రీనివాసులు రావు తన ఇద్దరూ కుమారులతో కలిసి నివాసం ఉండేవాడు.. అయితే గత కొద్ది రోజులుగా తండ్రి‌ మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చుట్టు పక్కల గ్రామాల్లో అప్పులు చేసి జల్సాలు చేసేవారు.. ఇదే విషయంపై గత రెండు ఏళ్ళుగా తండ్రి, కుమారులకు తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి.. ఎప్పటికైనా తమ కుమారుల్లో మార్పు రాకుండా పోతుందా అనే ఆశతో శ్రీనివాసురావు తన కుమారులు చేసిన అప్పులు తీర్చేవాడు.. అయితే గ్రామంలో ఉంటున్న గిరిబాబు నాయుడు అనే యువకుడితో శ్రీనివాసురావు ఇద్దరు కుమారులు స్నేహంగా మెలుగుతున్నట్లు శ్రీనివాసురావు తెలుసుకున్నాడు.. వీరిపై శ్రీనివాసురావు ఆరా తీసేవాడు.. ముగ్గురు రోజు పీకల వరకూ తాగి, పేకాట ఆడుతూ కాలం గడిపేవారు.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి గాయ పరిచేవారు.. దీంతో గ్రామంలో ఎవరూ వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.. రోజు రోజుకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తన కుమారులను తలుచుకుని శ్రీనివాసురావు కుమిలి పోయేవాడు.. అనేక మార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ముగ్గరిని హెచ్చరించినా వారు తీరు మార్చుకోకుండా పుల్ గా మద్యం సేవించి గ్రామస్తుల గొడవకు ఈడ్చేవారు.. అయితే తన కుమారులు చెడి పోయేందుకు కారణంమైన గిరిబాబు నాయుడిని పిలిచి‌న శ్రీనివాసులు తన కుమారులతో చేరొద్దని, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని పలుమార్లు హెచ్చరించాడు.. ఇవేవి పట్టించుకోని గిరిబాబు నాయుడు రోజులాగే మద్యం సేవించి శ్రీనివాసురావు కుమారులతో పేకాట ఆడేవాడు.. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసు రావు ఈ రోజు మధ్యాహ్నం తన కుమారులతో చేరద్దని గిరిబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు.. గిరిబాబు నాయుడు, శ్రీనివాసురావులు ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకుని, వాగ్వాదంకు దిగ్గారు.. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గిరిబాబు నాయుడు తన నివాసంలో ఉన్న కత్తిని తీసుకుని ఒక్కసారిగా శ్రీనివాసులరావుపై దాడి చేసి గ్రామస్తులు అందరూ చూస్తుండం గానే అతికిరాతకంగా నరికి చంపాడు.

Visakhapatnam Rail Service: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 

విశాఖపట్నం: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 


నగర సరిహద్దు స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళను విశాఖ కు రప్పించే ప్రయత్నాలు ప్రారంభం


విశాఖ స్టేషన్ నుంచి రెండు గంటలకు ప్రారంభం కానున్న తిరుమల ఎక్స్ప్రెస్(17488)


విజయనగరం లో ఆగిఉన్న హౌరా - యశ్వంత్ పూర్,  ప్రశాంతి ఎక్స్ప్రెస్ కు కూడా క్లియరెన్స్


మూడు గంటలకు మరోసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని ట్రైన్స్ ను పునరుద్ధరించాలని నిర్ణయం

Agnipath Protests Effect: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. కొత్తవలసలో ఒడిశా వాసి మృతి

విజయనగరం: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కొత్తవలసలో నిలిపివేయడంతో చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్‌ బెహరా(70) మృతి చెందారు. గుండెజబ్బు చికిత్స కోసం విశాఖ వస్తుండగా అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స పొందుతూనే జోగేష్ బెహరా మృతిచెందారు.

Rakesh Last Journey: మధ్యాహ్నం దబీర్‌ పేటలో రాకేష్ అంత్యక్రియలు

అగ్నిపథ్ నిరసనలో భాగంగా జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం ఖానాపురం మండలంలోని దబీర్‌ పేటలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అంతిమయాత్ర 60 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది.

Revanth Reddy Arrested: ఘట్‌కేసర్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్

ఘట్కేసర్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..
నర్సంపేటకు వెళ్తుండగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడినని ఈ ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని ఎలా అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు రేవంత్ రెడ్డి. అన్యాయంగా తనను అరెస్ట్ చేయకూడదంటూ పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.


నిన్న సికింద్రాబాద్ ఘటనలో మృతి చెందిన రాకేష్ పరామర్శకు బయల్దేరిన టిపిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్.
-బీబీనగర్ టోల్ గేట్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు.

Agnipath Protest Updates: రాకేష్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీ వద్ద సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు


అనంతరం రాకేష్ మృతదేహం ఊరేగింపులో పాల్గొని, ఆయన పాడే (శవ పేటిక) ను మోసిన మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తదితరులు


ఆ తర్వాత ఎంజీఎం నుండి ఖానాపూర్ మండలం డబ్బీర్ పేట వరకు జరిగిన శవ యాత్రలో కాలినడకన పాల్గొన్న మంత్రి


వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు.

Breaking News Telugu Live Updates: రేవంత్ రెడ్డితో పీజేఆర్ కూతురు భేటీ, టీఆర్ఎస్‌కు షాక్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పీజేఆర్ కూతురు విజయారెడ్డి భేటీ అయ్యారు. టీ ఆర్ ఎస్ లో అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించినా సరైన గుర్తింపు దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇంటి పార్టీ లోకి వస్తున్న అనే భావన ఉందని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని విజయారెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. టీ ఆర్ ఎస్ లో తనకు బౌండరీ గీశారని, కానీ శక్తి సామర్థ్యాన్ని చాటాలంటే  కాంగ్రెస్ పార్టీ అయితేనే సరైన వేదిక అని ఆమె భావిస్తున్నారు. 

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు దాదాపుగా అన్ని జిల్లాల్లోకి ప్రవేశించాయి. దీంతో ఇకనుంచి అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షాలు ఇంకా మొదలుకాకపోవడంతో ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది.  రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి.


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి.  కొనుగోలుదారులకు మళ్లీ షాక్ తగిలింది. మరోవైపు వెండి ధర నిలకడగా ఉంది. రూ.230 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100కి పుంజుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100 కి చేరగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,750 అయింది. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 కి చేరింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.66,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి


అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసనలో ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియ (అగ్నిపథ్)ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణంపై కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


రాకేష్ కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బీసీ యువకుడు రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ చేశారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.