అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల కర్కశత్వం కొనసాగుతోంది. ఇటీవల జలాలాబాద్ తాలిబన్ల కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన ఘటన మరువకముందే అసదాబాద్ లో అలాంటి సంఘటనే జరిగింది. అఫ్గానిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేసిన ప్రజలపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు చనిపోగా, కొంతమందికి గాయాలైనట్లు రైటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.






స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చాలామంది వీధుల్లోకి వచ్చారు. ఈ ఘటనలో చాలా మంది చనిపోయారు. అయితే వీరు తాలిబన్లు జరిపిన కాల్పుల్లో చనిపోయారో లేక తొక్కిసలాటలోనా అనే దానిపై స్పష్టత లేదని ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు తెలిపారు.






Also read:


Afghanistan Crisis Update: అయ్యో పాపం.. పసిపిల్లలను కంచెపై నుంచి విసిరేస్తున్న తల్లులు!


ఈ కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు చనిపోగా 8 మందికి గాయాలైనట్లు అల్ జజీరా టీవీ తెలిపింది. 'మా జెండా, మా గుర్తింపు' అనే నినాదాలతో నలుపు, ఎరుపు, పచ్చ జెండాలు పట్టుకొని కొంతమంది వీధుల్లో నిరసన చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 19న అఫ్గానిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ జరుపుకుంటోంది. 


నేడు తాలిబన్లు కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాత శత్రువలపై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోబోమన్నారు. ఇస్లామిక్ చట్టాలకు లోబడి మహిళలకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


Also read:


Taliban Crisis: తాలిబన్లు.. ఎంత పనిచేశారయా? భారత్ లో రేట్లు ఆకాశానికే!