ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ కారణంగా 10 మంది మృతి చెందారు. 24 గంటల్లో 67,716 మంది నమూనాలు పరీక్షించారు. కరోనా నుంచి మరో 1,697 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 15,738 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ కారణంగా.. కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందగా, తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.


#COVIDUpdates: 19/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,95,708 పాజిటివ్ కేసు లకు గాను
*19,66,274 మంది డిశ్చార్జ్ కాగా
*13,696 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,738#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/gjgyRzJEvc


— ArogyaAndhra (@ArogyaAndhra) August 19, 2021

" title="" >


కొవిడ్ కారణంగా రాష్ట్రంలో విధించిన రాత్రి పూట కర్ఫ్యూను  మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ కర్ఫ్యూను ఆగస్టు 21వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ ఆ  నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాత్రి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.


Also Read: Rahul Gandhi Tour: వరంగల్‌కు రాహుల్ గాంధీ.. అదే రోజు హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటి? 


అలాగే ఏపీలో పాఠశాలలు, కాలేజీలు కూడా ప్రారంభమయ్యాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో తరగతుల నిర్వహణకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.  విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు బ్యాచ్ ల వారీగా తరగతులను నిర్వహిస్తున్నారు.


Also Read: బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లబోతున్న ఈ కంటెస్టెంట్ గురించి తెలుసా..!


Also Read: CM Jagan: ఆ కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. వాళ్ల దగ్గర డబ్బులు రికవరీ చేయాల్సిందే


Also Read: స్వాతంత్య్ర దినోత్సవం రోజు తాలిబన్ల కాల్పులు.. పలువురు మృతి