Adani Group Prasad Seva in Puri Dham :   ఒడిశాలోని పూరీ ధామ్‌లో జూన్ 26 నుండి జూలై 8, 2025 వరకు జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా 'ప్రసాద సేవ'ను  అదానీ గ్రూప్ ప్రారంభించింది. ఈ సేవలో భాగంగా, లక్షలాది భక్తులు , సేవకులకు  శుద్ధమైన, పోషకమైన ఆహారం ఉచితంగా అందిస్తున్నారు   "సేవ హి సాధనా హై" అనే అదాని గ్రూప్ భావనకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లుగా  గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు.  పూరి ధామ్‌లో  రథయాత్ర 12 రోజుల పాటు  జరగనుంది. అదానీ గ్రూప్ సుమారు 40 లక్షల భోజనాలు మరియు పానీయాలను ఉచితంగా అందిస్తోంది.  ఇస్కాన్ సహకారంతో, రోజుకు 2,50,000 మంది భక్తులకు ప్రసాదం,  ఫ్రూట్ జ్యూస్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.   భక్తులతో పాటు, 2,000 మందికి పైగా పోలీసులతో పాటు వివిధ విభాగాల్లో విధుల్లో ఉండే వారికి ఆహారం అందిస్తారు. పూరీలోని ఇస్కాన్ కిచెన్‌లో ప్రసాద సేవ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.   గౌరాంగ దాస్, ఇస్కాన్ GBC సభ్యుడు ,  గోవర్ధన్ ఎకోవిలేజ్ డైరెక్టర్, ఈ సేవలో అదానీ ఫౌండేషన్  సహకారాన్ని ప్రశంసించారు.

గౌతమ్ అదానీ స్వయంగా ఈ కిచెన్‌ను సందర్శించి, ప్రసాద తయారీ మరియు పంపిణీలో పాల్గొన్నారు, అలాగే స్వయంగా ప్రసాదం స్వీకరించారు.

పూరీలో వివిధ ప్రదేశాలలో భక్తులు,  అధికారులకు ఉచిత భోజనాలు అందించే కౌంటర్లు ఏర్పాటు చేశారు.  ఒడిశా వేడిని తట్టుకోవడానికి నగరవ్యాప్తంగా చల్లని పానీయాలు అందించే కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.  స్వచ్ఛంద సేవకులకు ఉచిత టీ-షర్టులు, శానిటేషన్ కార్మికులకు ఫ్లూరోసెంట్ సేఫ్టీ వెస్ట్‌లు, అధికారులు, భక్తులకు జాకెట్లు, రెయిన్‌కోట్‌లు, క్యాప్‌లు,  గొడుగులు అందించారు..

 అదానీ ఫౌండేషన్ ఒడిశాలో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, పాఠశాల మౌలిక సదుపాయాలు,  జీవనోపాధి వంటి రంగాలలో ఇప్పటికే పనిచేస్తోం.    ఈ సేవను "భక్తి, సేవ,  సమర్పణ   ఉత్సవం"గా  అదానీ గ్రూప్ తెలిపింది.  

 అదానీ గ్రూప్   సేవా కార్యక్రమానికి ప్రసంసలు లభిస్తున్నాయి.  "పూరీ, ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది భక్తులకు ఉచిత, పోషకమైన భోజనాలు అందించినందుకు" ప్రశంసిస్తున్నారు.