ABP Southern Rising Summit : అక్టోబర్ 25వ తేదీన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో విభిన్నరంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రపై చర్చించనున్నారు.
రాశిఖన్నా !
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు హీరోయిన్ రాశిఖన్నా. ఇటీవలి కాలంలో ఉత్తరాది కంటే దక్షిణాది సినీ పరిశ్రమ అద్భుత విజయాల్ని నమోదు చేస్తోంది. ఈ క్రమంలో రాశి ఖన్నా దక్షిణాది సినీ పరిశ్రమ భవిష్యత్ లో ఎంత ఎత్తుకు ఎదుగుతుందో .. దేశ సినీ పరిశ్రమకు ఎలాంటి కంట్రిబ్యూషన్ ఇస్తుందో విశ్లేషించేందుకు ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు హాజరు కానున్నారు.
రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా
స్టార్టప్‌ల యుగంలో ఎంతో యువ ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త కొత్త ఐడియాలతో టెక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అలాంటి యువ టెకీ అరవింద్ సంకా. ర్యాపిడో ద్వారా అనేక వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. భవిష్యత్ లో వ్యాపార రంగం ఎదుర్కొనే సవాళ్లపై ఆయన సమ్మిట్‌లో చర్చిస్తారు.
నృత్యకళాకారిణి యామినిరెడ్డి
దక్షిణాది సాంస్కృతిక వారసత్వం దేశానికి ఎంతో కీలకం. కళలకు నిలయం దక్షిణాది రాష్ట్రాలు. అయితే మారుతున్న కాలంలో కళలను ఇప్పుడు అస్వాదించేవారు .. అభ్యసించే వారు కూడా తగ్గిపోతున్నారు. మరి భవిష్యత్‌లో ఎలా ఉండబోతోందో.. ఆశాజనకంగా మారాలంటే ఏం చేయాలో వివరేంచుందుకు సుప్రసిద్ధ క్లాసికల్ డ్యాన్సర్ యామిరెడ్డి సదరన్ రైజింగ్ సమ్మిట్‌కు హాజరవుతున్నారు.
అనూ ఆచార్య, మ్యాప్ మై జీనోమ్ సీఈవో
మారుతున్న జీవన పరిస్థితుల్లో మనుషులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం జీన్స్‌లోేనే ఉంటుందని వైద్య నిపుణలు చెబుతున్నారు. ఈ కోణంలో డాక్టర్ అనూ ఆచార్య మ్యాప్ మై జీనోమ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో తనదైన ముద్ర వేశారు. అనూఆచార్య ఆలోచనలు కొత్త మార్పునకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. సమ్మిట్‌లో ఆమె తన ఆలోచనలు వివరించేందుకు సిద్దమవుతున్నరు.
ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా తో సహా అనేక మంది ప్రముఖులు సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. వీరందరూ తమ అభిప్రాయాలను, ఆలోచలను.. వివరించేందుకు ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు.