Ideas of India Summit 2024: ఏబీపీ నెట్వర్క్ తన వార్షిక 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌ను వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తోంది.  మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే చిన్న చిన్న అంశాలను కూడా వివిధ కోణాల్లో చర్చించి.. భవిష్యత్ లో ప్రపంచాన్ని మార్చే అద్భుతమైన విషయాలను , ఆలోచలను పంచుకోవడానికి ఈ వేదిక ద్వారా ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ అవకాశం కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ భవితవ్యాన్ని నిర్ణయించే 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో ముంబైలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.


భారతదేశం , ప్రపంచం ఎలా ముందుకు పురోగమించాలో 2024 నిర్ణయించనుంది.  సమాజం, సంస్కృతి, రాజకీయాలు, మంచి, చెడు, వికృతమైన మార్పులను అంచనా వేసి, తమకు ఏం కావాలో ప్రపంచానికి తెలియజేసే 'పీపుల్స్ ఎజెండా' సంవత్సరం ఇది. ఐడెంటిటీ పాలిటిక్స్ నుండి వాతావరణ మార్పు వరకు, కృత్రిమ మేధస్సు  సవాళ్లు నుండి ప్రపంచ శక్తి  విపత్తు వరకు ఐడియాస్ ఆఫ్ సమ్మిట్‌లో చర్చిస్తారు. యూరోపియన్ యుద్ధం  నుంచి నేర్చుకోవాల్సిన "పాలి క్రైసిస్" అంశాలపైనా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎలా చూసినా 2024 ఓ గేమ్ చేంజర్ సంవత్సరం అనుకోవచ్చు. 


అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డే రాజకీయాలు, లాభాల వేటలో తీరిక లేకుండా ఉండే కార్పొరేట్ ప్రపంచం, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడే కల్చరల్ ఎకోసిస్టమ్.. ఇలాంటి వాటన్నింటినీ ఐడియాస్ ఆఫ్ ఇండియా మూడో ఎడిషన్ తన ఎజెండాలో భాగంగా చర్చిస్తుంది. 


ఏబీపీ నెట్వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ 2024 ఏడాదిలో రాబోయే  అనేక సంక్లిష్టతలను ఛేదించడానికి ఆలోచనా పరులైన దిగ్గజాలను ఆహ్వానిస్తోంది. ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఈ ఏడాది చోటు చేసకోబోయే మార్పులు.. వాటి వల్ల ఏర్పడే పరిణామాలపై చర్చిస్తారు.  కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రకంపనలతో  పాటు నిరంతర  యుద్ధం, అంతకంతకూ బలపడుతున్న చైనా వంటి ప్రపంచ  విషాయలను.. విశ్లేషిస్తారు. వాతావరణ మార్పులు , మానవ వలసలు వంటి సవాళ్లతో పాటు దీర్ఘకాలిక పరిణామాలు వాటికి అవసరమైన పరిష్కారాలనూ విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఎలా చూసినా ప్రపంచం మొత్తానికి ఓ ప్రత్యేక సంవత్సరం అవుతుంది. 


ప్రపంచం అంతా మన వైపు చూస్తున్న సమయంలో .. రాతలను మార్చే దిగ్గజాల అద్భుత ఆలోచనలు, చర్చలలను చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ దేశం ఎంత గొప్ప మార్పును చూడబోతోందో.. అంచనా వేయనుంది.  
 


ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో బ్రిటీష్ ఎంపీ సుయెల్లా బ్రేవర్ మన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఇండో-అమెరికన్ రచయిత్రి, మోడల్ పద్మ లక్ష్మి, కళాకారిణి సుబోధ్ గుప్తా, రచయిత అమిష్ త్రిపాఠి, నటి కరీనా కపూర్ ఖాన్, ఫైనాన్స్ కమిషన్ చైర్ పర్సన్ అరవింద్ పనగరియా, పొలిటికల్ సైంటిస్ట్ సునీల్ ఖిల్నానీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తో పాటు  ఇంకా చాలా మంది ప్రముఖులు పాల్గొంటారు.  


ఫిబ్రవరి 23-24 తేదీల్లో జరిగే ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో అన్ని డిబేట్లు, చర్చల కోసం ఏబీపీ లైవ్‌ను ఫాలో అవ్వండి.