ABP Southern Rising Summit:   దక్షణాది విజయాలను మరింత బలంగా వినిపించేలా రెండో ఎడిషన్  సదరన్ రైజింగ్ సమ్మిట్ శుక్రవారం వైభవోపేతంగా జరగనుంది.  ఏబీపీ నెట్‌వర్క్. దేశంలో పలు భాషల్లో మీడియా సంస్థలను నడుపుతున్న ABP NETWORK ఇండియా గ్రోత్ స్టోరీలో సౌతిండియా ప్రాధాన్యతను తెలిపేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. సౌతిండియా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసేలా  The Southern Rising Summit 2024 ను అక్టోబర్ 25న హైదరాబాద్‌లో జరపనుంది. ఈ సెకండ్ ఎడిషన్ సమ్మిట్ లో దక్షణాది రాజకీయ, సాంస్కృతిక, పారిశ్రామిక, క్రీడా రంగాల్లో వేసిన ముద్ర వేసిన వారు మాట్లాడతారు. దేశ ప్రగతిలో దక్షిణ భారత ప్రాధాన్యతను అందులో ఈ వ్యక్తుల పాత్రను సదస్సు ఆవిష్కరిస్తుంది. "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జాతీయ కోణంలో దక్షిణాది ప్రాధాన్యతను మరోసారి ప్రముఖంగా ప్రస్తావించనుంది. 


“Coming of Age: Identity, Inspiration, Impact”, అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో  కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు దక్షిణాది ప్రత్యేకతను నిలబెట్టుకునే అంశంపై ప్రభావవంతమైన చర్చలు జరుగుతాయి. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సిన అంశాల ప్రముఖులు తమ ఆలోచనలు పంచుకుంటారు. సౌతిండియా నుంచి అగ్రశ్రేణి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖలు, రచయతలు, వ్యాపారులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరిస్తారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహననాయుడు తన అంతంగాన్ని ఆవిష్కరిస్తారు. ఇండియన్ బాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ పుల్లెలగోపీచంద్, స్టార్ హీరో సాయి దుర్గా తేజ్, నటి రాశీఖన్నా, జాతీయ నటుడు ప్రకాష్ రాజ్, మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు,  రచయిత చిదంబరం, వెటరన్ యాక్టర్ గౌతమి వంటి వారు పాల్గొంటున్నారు. 


రాజకీయ రంగంలోనూ దక్షిణాదిది ప్రత్యేక పాత్ర. సంచలన యువనేతలు తెరపైకి వస్తున్నారు. వారి వారి భావజాలాలను సమర్థంగా వినిపిస్తున్నారు. ఇలాంటి వారిలో ఇటీవల దేశం దృష్టిని ఆకర్షించిన బీజేపీ నేత కొంపెల్ల మాధవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిది డాక్టర్ షామా మహమ్మద్, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్, బీజేపీ ఎంపీ రఘునందన్ వంటి వారు కూడా దక్షిణాది రాజకీయ రంగం భవిష్యత్‌లో దేశంలో పోషించబోతున్న పాత్రపై తమ విశ్లేషణను అందిస్తారు. అలాగే సాంస్కృతి రంగం నుంచి క్లాసికల్ సింగర్ బిందు సుబ్రహ్మణ్యం, అవార్డు విన్నింగ్ సింగల్ శిల్పా రావు, క్లాసికల్ డాన్సర్, మూడు సార్లు జాతీయ అవార్డు పొందిన యామినిరెడ్డి దక్షిణాది కల్చర్ హెరిటేజ్‌ను  హైలెట్ చేస్తారు. అదే సమయంలో దక్షిణాది భవిష్యత్‌లో ఎలా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందో రచయిత, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్ చర్చిస్తారు. ఇక దక్షిణాది నుంచి వ్యాపార రంగంలో సంచలనాలు నమోదవుతున్నాయి. స్టార్టప్‌లలో తనదైన ముద్ర వేసిన రాపిడో కో ఫౌండర్ అరవింద్ సంకా యువత మరింత వేగంగా వ్యాపార రంగంలో రాణించడానికి ఎలాంటి పాలసీలు అవసరమో... ప్రభుత్వాల వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చో తన ఆలోచనలు పంచుకుంటారు. 


అన్ని రంగాల్లోనూ దక్షిణాది తనదైన ముద్ర వేస్తోంది. ఈ ప్రత్యేకతను చాటేలా రోజంతా అవకాశాలు, అవగాహనలు, అంచనాలపై అర్థవంతమైన చర్చలు ఉండేలా "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" జరగనుంది. దేశాభివృద్ధిలో దక్షిణాది పాత్రను ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకునేలా కార్యక్రమం జరుగుతుంది. 


 దక్షిణాది ప్రత్యేకతను, సాధించబోయే విజయాలను , దేశ పురోగతికి అందిస్తున్న చేయూతను ప్రత్యక్షంగా చర్చించేందుకు మాతో కలవండి.  అక్టోబర్ 25వ తేదన ఉదయం గం.10 నుంచి ABP Nework అన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లపై ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.



ఏబీపీ నెట్ వర్క్ గురించి !


విశ్వసనీయత, నూతన ఆవిష్కరణలతో పలు భాషల్లో సత్తా చాటుతూ జాతీయ మీడియా రంగంలో కీలకంగా ఉంది ABP NETWORK.  వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ABP  గ్రూప్ నుంచి టెలివిజయన్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లను ABP NETWORK నిర్వహిస్తోంది.  దేశంలో పలు భాషల్లో 535 మిలియన్ల మంది వ్యూయర్స్‌ను కలిగి ఉంది ఏబీపీ నెట్వర్క్. ఏబీపీ స్టూడియోస్ ద్వారా న్యూస్ కాకుండా ఇతర విషయాల్లోనూ భిన్నమైన కంటెంట్‌ను అందించడంలోనూ ప్రత్యేక ముద్ర వేసింది. దక్షిణాదిలో తెలుగులో ఏబీపీ దేశం, తమిళంలో ఏబీపీ నాడు ద్వారా డిజిటల్ మీడియాలో బలమైన ముద్ర వేసింది. ABP NADU తమిళ సంస్కృతి, తమిళభాషను ఉన్నతం చేస్తూ ప్రజలకు అవసరమైన సమాచారాన్ని శరవేగంగా అందిస్తూ అనతి కాలంలోనే ఆదరణ పొందింది. మన వార్తలు.. మన ఊరి భాషలో అనే కాన్సెప్ట్‌తో ABP DESAM తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫాం గ్రామస్థాయి ప్రజలకూ చేరువ అయింది. ఏపీ, తెలంగాణ సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబిస్తూ.. వారి ప్రీతిపాత్రమైన డిజిటల్ ఫ్లాట్‌ఫాంగా నిలిచింది.