INDO-UK FTA:   భారత్ యుకే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం రెండు దేాశాల వాణిజ్యంలో కీలకమైన ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు. ABP Network నిర్వహించిన India@2047 సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని.. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. 

INDO-UK FTA చారిత్రాత్మకం

ఇండో యు.కె స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమని ప్రధాని అన్నారు. ఏబీపీ సమ్మిట్‌లో ప్రసంగం ప్రారంభించిన ఆయన "కొద్ది సేపటి క్రితమే అగ్రిమెంట్ ఫైనల్ అయిందటూ" ఆ వివరాలను పంచుకున్నారు. ఈరోజు మనదేశానికి కు చారిత్రాత్మకమైన రోజు. ఏబీపీ సదస్సుకు వచ్చే ముందే బ్రిటన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ వచ్చాను. భారత్ - యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైందని ఇక్కడ ప్రకటించటానికి సంతోషిస్తున్నాను. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఓపెన్ మార్కెట్ దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం..ఇరు దేశాల చరిత్రలో సువర్ణాధ్యాయం. మన యువతకు ఇది శుభవార్త.  మన దేశంలో సరికొత్త వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. సూక్ష్మ మధ్యతరహా చిన్న పరిశ్రమలకు ఈ ఒప్పందంతో మేలు చేకూరుతుంది. ఉపాధి అవకాశాలకు సరికొత్త దారులు తెరుచుకుంటాయి. కాసేపటికి క్రితమే యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాలతోనూ సరికొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశాం. ఈ రోజు భారత్ సంస్కరణల పరంగానే కాదు ప్రపంచ దేశాలతో కలిసి నడుస్తూ వాణిజ్య, వ్యాపార హబ్ గా మారుతోంది." అన్నారు

దాాదాపు మూడేళ్లుాగా ఈ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాలు కూడా ఎగుమతులు , దిగుమతి సుంకాల విషయంలో మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాయి. 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. 2040 నాటికి బ్రిటన్-యు.కె  మధ్య వాణిజ్యాన్ని  ప్రస్తతం ఉన్న లక్షా 80వేల కోట్ల నుంచి 4.43లక్షల కోట్ల రూపాయలకు చేర్చాలని భావిస్తున్నాయి. యుకె నుంచి వచ్చే స్కాచ్ విస్కీ రేట్ సగం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న 150శాతం టాక్స్ ను 75శాతంకు తీసుకొస్తారు. ఆ తర్వాత పదేళ్లలో దానిని 40శాతానికి తీసుకెళ్తారు. యుకె వెళ్లే మన విద్యార్థులకు కూడా మేలు జరగనుంది.  అక్కడ తీసుకుంటున్న సామాజిక భద్రత డిపాజిట్‌ను తీసేస్తున్నారు. యుకె కూడా భారత్ నుంచి అయ్యే ఎగుమతులపై  పన్నులు తగ్గించడం వల్ల ఇక్కడ MSMEలు లాభపడనున్నాయి. 99శాతం భారత ఎగుమతులు జీరో టాక్స్ పరిధిలోకి రానున్నాయి. 

మనం మార్కెట్ మాత్రమే కాదు.. మేకర్స్ కూడా

  వికసిత్‌ భారత్ లక్ష్యాల గురించి ABP సదస్సులో మోదీ ఎక్కువుగా మాట్లాడారు. 100 ఏళ్ల లక్ష్యాలను అందుకునే సత్తా మనకుందన్నారు. మనకున్న వనరులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. "ఒకప్పుడు భారత్ అంటే అతిపెద్ద మార్కెట్ మాత్రమే. మనం మేకర్స్ కాదనే భావన ఉండేది. ఇప్పుడు దానిని తుడిచిపెట్టాం. ఆత్మనిర్భరత అనేది మన ఆర్థిక డీఎన్‌ఏలోనే ఉంది. ఇప్పుడు భారత్ అతిపెద్ద రక్షణ పరికరాల తయారీదారు. మన రక్షణ ఉత్పత్తులు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతుల విలువ అంతకంతకు పెరుగుతోంది". అని మోదీ వ్యాఖ్యానించారు.