Basavatarakam Hospital in Amaravati: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీ అథారిటీ 47వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో ఏడు సంస్థలకు భూముల కేటాయింపునకు సీఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదించింది. గతంలో 64 సంస్థలకు భూముల కేటాయింపులు పూర్తికాగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద జరిగిన సీఆర్డీ అథారిటీ సమావేశంలో మరో 7 సంస్థలకు కేటాయింపులు చేసింది అథారిటీ...వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను అథారిటీ సమావేశంలో తీసుకున్నారు.
2014-19 మధ్య కాలంలో అమరావతిలో మొత్తం 131 సంస్తలకు భూములు కేటాయింపు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి ఆయా సంస్థలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాం...ఎవరెవరు ఎప్పుడెప్పుడు సంస్థల ఏర్పాటు పనులు ప్రారంభిస్తారు...ఎంతెంత స్థలం అవసరం అనే దానిపై చర్చించాం...కొన్ని సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటును త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పగా....మరికొన్ని సంస్థలు విత్ డ్రా చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థలకు భూకేటాయింపులు రద్దు చేసి...కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి భూకేటాయింపులు చేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన వాటికి సీఆర్డీఏ అధారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. .అథారిటీ సమావేశంలో కొత్తగా ఆరు సంస్థలకు కేటాయింపులు చేశామని మంత్రి నారాయణ ప్రకటిచించారు .
ఇప్పటివరకూ మొత్తం 71 సంస్థలకు కేటాయింపులు పూర్తయినట్లు తెలిపారు. కొత్తగా భూములు సంస్థలు,కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.
క్వాంటం వ్యాలీ - 50 ఎకరాలులా యూనివర్శిటీ - 55 ఎకరాలుఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ - 0.78 ఎకరాలుఐఆర్ సీటీసీ - ఒక ఎకరంబసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కు గతంలో కేటాయించిన 15 ఎకరాలకు అదనంగా 6 ఎకరాలుకోస్టల్ బ్యాంకు - 0.4 ఎకరాలురెడ్ క్రాస్ సొసైటీ - 0.78 ఎకరాలు
మరోవైపు గెజిటెడ్,నాన్ గెజిటెడ్ భవనాలు,మౌళిక వసతుల పూర్తికి సీఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపింది. గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పూర్తికి 514.41 కోట్లు,ఆయా భవనాల వద్ద అదనపు మౌలిక సదుపాయాలు కల్పన కోసం రూ.194.73 కోట్లకు సీఆర్డీఏ అథారిటీ అనుమతిచ్చింది...అలాగే ఎన్జీవోలకు సంబంధించిన 9 టవర్ల నిర్మాణానికి 506.67 కోట్లతో,మరో 12 టవర్ల నిర్మాణానికి,మౌళిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి.రాజధానిలో 190 ఎంఎల్డీ సామర్ధ్యం గల వాటర్ ట్రీట్ మెంట్ నిర్మాణంతో పాటు ఐదేళ్ల పాటు ఆపరేషన్ మరియు నిర్వహణకై 560.57 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి 494.86 కోట్లతో టెండర్లకు ఆమోదం లభించిందన్నారు..జాతీయ రహదారులకు అనుసంధానం చేసేలా ఇ-13 రోడ్డును 4.10 కి.మీ మేర 384.78 కోట్లతో,ఇ-15 రోడ్డును 3.98 కి.మీ మేర 70 కోట్లతో మౌళిక సదుపాయాలతో కలిపి పొడిగించేందుకు అథారిటీ నిర్ణయం తీసుకుంది...ఇక సీడ్ యాక్సిస్ రోడ్డు ఇ-3లో 1.5 కి.మీ మేర ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి సీఆర్డీ అథారిటీ ఆమోదముద్ర వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు..