Rats are the reason for the success of Parachute Oil: ప్యారాచూట్ ఆయిల్.. మారుమూల పల్లెటూరు నుంచి దేశరాజధాని ఢిల్లీ వరకు ఈ ఆయిల్ తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండకపోవచ్చు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తలకు ఈ ప్యారాచూట్, లేదా వేరే కంపెనీల ఆయిల్‌ను వాడుతుంటారు. ఈ హెయిర్ ఆయిల్ ఇంతలా సక్సెస్ కావడానికి కారణం ఎవరో తెలుసా.? ఎలుకలు.. వాట్ ఎలుకలా.? అంటే ఎస్.. ఎలుకలు అనే చెప్పాలి.
1980 లో ప్యారాచూట్ ఆయిల్‌ని టిన్ క్యాన్స్‌లో సప్లై చేసేవాళ్లు. ఈ టిన్ క్యాన్స్‌కు ముందు చదరపు ఆకారంలో ఉండే ప్లాస్టిక్ డబ్బాల్లోనే సప్లై చేసేవాళ్లు. కానీ ఇదే సమయంలో సేల్స్ కోసం ఉంచిన ప్లాస్టిక్ క్యాన్స్‌ను నాశనం చేసి వాటిని కిందపడేసివి ఎలుకలు. ఇలా తరుచూ నూనె మొత్తం నేల పాలైపోవడంతో ప్యారాచూట్ సంస్థకు చాలా నష్టం వాటిల్లేదంటా. ఆ తర్వాత టిన్ క్యాన్స్‌లో ఆయిల్ సప్లై చేయడం ప్రారంభించారు. అయితే ఈ టిన్ క్యాన్స్‌కు మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుండటంతో మళ్లీ ప్లాస్టిక్ బాటిల్‌తో సేల్స్ ప్రారంభించింది. వాటర్ బాటిల్ షేప్‌తో పాటు చిన్న సైజ్‌లో సప్లై ప్రారంభించింది ప్యారాచూట్ సంస్థ. అయితే మొదట్లో ఉన్న ప్లాస్టిక్ క్యాన్స్‌ను పట్టుకునేందుకు ఎలుకలకు ఎక్కువగా గ్రిప్ ఉండేది. కానీ ఇప్పుడు వాటర్ బాటిల్ మోడల్లో ఉండటంతో ఎలుకలు వీటిపైకి ఎక్కేందుకు సాధ్యపడలేదంటా. దీంతో సక్సెస్ ఫుల్‌గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే డిజైన్‌ను కంటిన్యూ చేస్తుంది ప్యారాచూట్ సంస్థ.
మారికో వ్యవస్థాపకుడు హర్ష్ మారివాలా 2013 లో ఇన్‌సైట్ అనే కార్యక్రమంలో తెలిపిన విషయాలు ఇక్కడ అందిస్తున్నాం. ఒక ఉత్పత్తిని గుర్తించటం, కొత్త మార్పు తెచ్చే ఆలోచనల ద్వారా చిన్న వ్యాపారంగా ప్రారంభించిన పారాచూట్ బ్రాండ్ మార్కెట్ లీడర్ ఎలా అయిందో చెప్పారు. మల్టి నేషనల్ కార్పోరేషన్లు ఎంట్రీ ఇవ్వని రంగం కోసం చూడగా.. తలకు రాసుకునే నూనెల రంగం కనిపించింది. ముఖ్యంగా భారతదేశంలో, ఇరుగుపొరుగు దేశాలు, కొన్ని ఆసియా ప్రాంతాల్లో తలకు నూనె రాసుకునేవారు. ఎవరినైనా పెట్టాలని అడిగితే.. వాళ్లు “తలకు నూనె అద్దుకోవటం అంటే ఏమిటి”? అని అడిగేవారని తెలిపారు. ఈ రంగంలో పోటీ తక్కువ, విజయావకాశాలు ఎక్కువ. దాంతో ఈ తలనూనెల మార్కెటు ఇంకా పెరుగుతూనే ఉంది.
బ్రాండ్ సక్సెస్ కావాలంటే ప్యాకింగ్ పద్ధతి కీలకమని, తాము ఎనభై దశకంలో ఈ వ్యాపారంలో ప్రవేశించినప్పుడు నూనెను డబ్బాల్లో అమ్మేవారని చెప్పారు. రేకు కంటే ప్లాస్టిక్ చవక అని, డబ్బాల నుండి ప్లాస్టిక్ లోకి ప్యాక్ చేయాలనుకున్నారు. సాధారణంగా కంపెనీలు మార్కెట్లో ఒక ఉత్పత్తిని ప్రవేశ పెట్టె ముందు, లోతుగా అధ్యయనం చేసి కొబ్బరినూనెకు ప్లాస్టిక్ పాకింగ్ లో విజయవంతం కాదు అని తేల్చింది. నాలుగు పలకల ఆకారంలో సీసాలను తయారు చేశారు. ఆ పని సరిగా చెయ్యకపోవటం వల్ల నూనె కారిపోయేది. ఎలుకలు వాటి పని పట్టేవి. ఇలా కాదని, గుండ్రని సీసాను తయారు చేశాము. వాటిని ఎక్కడానికి ఎలుకలకు పట్టు దొరకదు. చుక్క నూనె కూడా బయటకు రాకుండా కొన్ని నూనె సీసాలను ఒక పంజరంలో కొన్ని ఎలుకలతో పాటు ఉంచారు. ఎలుకలకు పట్టు దొరకక నూనె సీసాలను ఏం చేయలేకపోయాయి. ఖర్చు తక్కువ అయిన ప్లాస్టిక్ డబ్బాల్లో గుండ్రని ఆకారంలో ప్యాకింగ్ చేసి సక్సెస్ సాధించామని మారివాలా వివరించారు.