పంజాబ్, హర్యానా కోర్టును రక్షణ కోసం ఓ ప్రేమ జంట ఆశ్రయించింది. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న తమకు ముప్పు ఉందని.. తక్షణం రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం ఆ జంట  మైనర్లు కాదు. మేజర్లే. అయితే ఒకరు సూపర్ మేజర్.. మరొకరు నిన్నామొన్న గడువు తీరిన మేజర్. సూపర్ మేజర్ అని చెప్పడం కన్నా.. ఇక్కడ సీనియర్ సిటిజన్ అని చెప్పుకోవడం బాగా సూటవుతుంది. కోర్టును ఆశ్రయించిన జంటలో  మగ వ్యక్తికి అక్షరాలా 67 ఏళ్లు. యవతికి కేవలం 19 ఏళ్లు. ఇద్దరి మధ్య  వయసు తేడా 48 ఏళ్లు ఉండటం.. ఇదేదో తేడాగా ఉందని అనుమానం రావడంతో .. పంజాబ్, హర్యానా హైకోర్టు దీనిపై మరింత పరిశీలన చేయాలని నిర్ణయించుకుంది. విచారణ జరపాలని .. అసలు ఆ జంట కథాకమామీషు ఏమిటో తెలియచేయాలని పల్వార్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. 


న్యాయమూర్తి వారికి రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుని.. ఈ అంశంపై పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఒక వారంలో ఎస్పీ దీనిపై విచారణ పూర్తి చేసి.. అసలు వారెవరు..? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు..?  వారికి ఎవరి నుంచి ముప్పు ఉంది..? వారు ఎందుకిలా కోర్టును ఆశ్రయించారు..? లాంటి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. వారిద్దరూ వయసు తేడా చూస్తే ఇది ఇష్టపూర్వకమైన వివాహంలా అనిపించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. బలవంతంగా వివాహం చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే.. దంపతుల ఇద్దరి స్టేట్‌మెంట్లను రికార్డు చేయమని ఆదేశించారు. ప్రస్తుతానికి వారిద్దరిన


హర్యానాలో ఇలాంటి పెళ్లిళ్లు.. వివాదాలు..ఖాప్ పంచాయతీలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఎక్కువగా కోర్టుల వరకూ రావు. కానీ కేసు భిన్నంగా ఉంది. వారిద్దరూ తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని పెద్దలు ఒప్పుకోలేదని.. రక్షణ కోసం అన్నట్లుగా హైకోర్టుకు వచ్చారు. అదే అనేక అనుమానాలకు కారణం అయింది. 67 ఏళ్ల వ్యక్తి ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదా.. చేసుకుంటే అతని భార్య ఏమయింది..? అతని మొదటి పెళ్లా..?  మరీ 19 ఏళ్ల యువతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు ?  ఇలాంటి అనుమానాలు అందరికీ వస్తాయి. సహజంగానే.. న్యాయమూర్తికి వచ్చాయి. దాంతో విచారణకు ఆదేశించింది. విచారణలో అసలు విషయాలు బయటపడతాయి. వారంలో కోర్టుకు పూర్తి సమాచారాన్ని హర్యానాలోని పల్వాల్ జిల్లా  ఎస్పీ సమర్పించనున్నారు. అప్పుడే ఈ  వృద్ధ భర్త.. పడుచు భార్య లవ్ స్టోరీలో అసలు మ్యాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంది.