Digital Arrest : పోలీసులు వచ్చి యూ ఆర్ అండర్ అరెస్ట్ అని అరవడం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. పోలీసులు గోడలు దూకి వెళ్లి ఇంట్లో ఉన్న నిందితుల్ని అరెస్టు చేసి తీసుకుపోవడం చూసి ఉంటాం. కానీ డిజిటల్ అరెస్టు అనేది ఎక్కడైనా చూశామా ?. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అంటే మన ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు అన్నీ బ్లాక్ చేసేసి..మనల్ని నిస్సహాయుల్ని చేయడమే డిజిటల్ అరెస్ట్ అనుకుంటారు. కానీ అసలు మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్‌లో వీడియో కాల్‌లోకి వచ్చి యూ ఆర్ అండర్ అరెస్ట్ అని బెదిరించడమే. 


ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే బూచి చూపించి పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేస్తున్న మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా విజయ్ పటేల్ ఆనే వ్యక్తికి కూడా ఇలాంటి మోసగాళ్ల నుంచి కాల్ వచ్చింది. ఓ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఆ పార్శిల్ మీ పేరు మీద ఉందని చెప్పి ప్రారంభించారు. తర్వాత డబ్బులు అడగడం ప్రారంభించారు. ఇందు కోసం వారు ఎంచుకున్న బెదిరింపుల మార్గం డిజిటల్ అరెస్ట్.   



ఎవరికీ చెప్పవద్దని.. ఇంటి  బయట తాము పెట్టిన పోలీసులు ఉన్నారని బెదిరిస్తారు. ఎవరికీ తెలియకుండా లక్షలు బదిలీ చేయించుకుం టారు. ఇంత ఈజీగా ఎలా నమ్ముతారు అంటే.. వారు పోలీస్ స్టేషన్ సెటప్ వేసుకుని ఉంటారు. పక్కాగా నటిస్తారు. అందుకే భయపడిపోతున్నారు. విజయ్ పటేల్ అనే వ్యక్తి ఈ డిజిటల్ అరెస్ట్  పేరుతో మోసం చేసే వాల్ల బండారాన్ని ప్రత్యేకంగా రికార్డు చేసి మరీ బయట పెట్టాడు.  ]





 


విజయ్ పటేల్ బయట పెట్టిన వీడియోలను చూసి.. మరోసారి ఎవరూ డిజిటల్ అరెస్ట్ అంటే భయపడాల్సిన పనే ఉండదని అర్థం చేసుకోవచ్చు. సాధాణంగా పోలీసులు, చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అందుకే ఎవరూ భయపడవద్దని విజయ్ పటేల్ సలహా ఇస్తున్నాడు. 





 విజయ్ పటేల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ మోసం మొత్తం వీడియోను చూస్తే ఇక ఎవరూ మోసపోయేందుకు అవకాశం ఉండదు.