కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో జీపులోని ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
రాయలపాడు నుంచి ప్రయాణికులతో చింతామణికి జీపు వెళుతుండగా... బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న లారీ, జీపును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో పెను విషాదం చోటుచేసుకుంది. జీపులో ప్రయాణిస్తున్న వారు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: మరికొన్ని గంటల్లో నీట్ పరీక్ష.. రాత్రికి రాత్రే విద్యార్థి ఆత్మహత్య.. భయానికి అదే కారణమా!