Haryana School Bus Accident: హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్నౌల్ జిల్లాలో స్కూల్ బస్ అదుపు తప్పి పడిపోయింది. రంజాన్‌కి సెలవు ఉన్నా ఆ స్కూల్‌కి హాలీడే ఇవ్వలేదు. GL Public School కి చెందిన ఈ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తుండగా ఉన్నట్టుంది అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. అయితే...స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం స్కూల్ బస్సు వేగంగా వచ్చి ఓ చెట్టుని ఢీకొట్టి అదుపు తప్పింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బస్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఆరేళ్ల క్రితమే ఎక్స్‌పైర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. జిల్లా యంత్రాగం వెల్లడించిన వివరాల ప్రకారం..12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. ప్రమాదానికి కారణమేంటో విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
పండుగ పూట విషాదం, చెట్టుని ఢీకొట్టి బోల్తా పడిన స్కూల్ బస్సు - ఆరుగురు చిన్నారులు మృతి
Ram Manohar | 11 Apr 2024 11:33 AM (IST)
Haryana Bus Accident: హరియాణాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.
హరియాణాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.