50 slaps in 60 Seconds: మహిళల్ని గృహ హింసకు గురి చేసే భర్తలు అన్ని చోట్లా ఉంటారు. కొంత మంది మరీ వయోలెంట్ గా ఉంటారు. వారిలో ఒకడు ఈ ఇండోర్ కు చెందిన వ్యక్తి. తన భార్యపై నిమషం వ్యవధిలోనే యాభై సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. ఈ వీడియో చూసి పోలీసులే షాక్ ఇయ్యారు.  

Continues below advertisement


ఇండోర్‌లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ కు ఇటీవల ఓ మహిళ వెళ్లింది. తన భర్త కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది.  సూర్యదేవ్ నగర్‌లో నివసిస్తున్న ఒక మహిళ  తన భర్త ప్రతిరోజూ తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది.  ఇలాంటి ఫిర్యాదులు గతంలో రెండు సార్లు చేసింది. కానీ పోలీసులు కేసులు పెట్టలేదు. ఇప్పుడు మూడో సారి ఆ ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు చర్యలు తీసుకునేందుకు సంకోచిస్తున్నారు. దీంతో  ఆ వీడియోను పోలీసులకు ఇచ్చింది. 


తీవ్రంగా కొట్టినట్లుగా వీడియో ఉండటంతో   ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ రోజు కుమారుడ్ని తిట్టడం వల్ల ఆ తండ్రికి కోపం వచ్చింది. దాంతో భార్యపై విరుచుకుపడ్డాడు. నిమిషం పాటు అలా కొడుతూనే ఉన్నాడు. 



అయితే అది మొదటి సారి కాకపోవడంతో ఆ మహిళ చాలా ప్లాన్డ్‌గా తనపై జరుగుతున్న దాడి విషయాన్ని గుర్తించి రికార్డింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. తనను కొడుతున్న దృశ్యాలను మొత్తాన్ని రికార్డు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఆ వీడియోను రికార్డు చేసుకున్న వెంటనే పోలీసుల వద్దకు వెళ్లలేదు. అది ఏడాది  కిందట కొట్టిన వీడియో అని పోలీసులు గుర్తించారు. ఇంకా వేధింపులు, కొట్టడం ఆపలేదని అందుకే ఆ వీడియోను ఇప్పుడు పోలీసులకు ఇచ్చానని ఆమె అంటున్నారు.  



ఈ దాడి ఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ పోలీసులు  పోలీస్ స్టేషన్‌లో   కుటుంబ సభ్యుల ముందు ఒక ఒప్పందానికి వచ్చారు. అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.