5 Planets Visible From Earth: ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. మార్చి 28వ తేదీన  బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒక చిన్న 50 డిగ్రీల సెక్టార్ లో ఆకాశంలో కనిపించనున్నాయి. ఈ సమయంలో ఈ ఐదు గ్రహాలను చూస్తే అన్ని దగ్గర దగ్గరగా ఉన్నట్లుగా కనిపించనుంది. అయితే ఎప్పట్లాగే ఈ గ్రహాల మధ్య కోట్లాది కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో ఈ ఐదు గ్రహాలు భూమి పై నుండి చూసినప్పుడు ఒక దగ్గరికి వచ్చినట్లుగా దృశ్య దృగ్విషయం ఏర్పడనుంది. మార్చి 28వ తేదీన బృహస్పతి, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారక గ్రహాలు 50 డిగ్రీల సెక్టార్ లో ఒక దగ్గరికి చేరనున్నాయి. ఈ దృశ్యం రోదసీపై ఆసక్తి ఉన్న వారికి బంపర్ ఆఫర్ లాంటిది. 


గురు గ్రహం -2.1 మాగ్నిట్యూడ్ లో, బుధగ్రహాన్ని -1.3 మాగ్నిట్యూడ్ లో చూడొచ్చు. బైనాక్యులర్ ఉపయోగించి సూర్యాస్తమయం తర్వాత ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని స్టార్ వాక్ సూచించింది. ఈ రెండు గ్రహాలు మీనరాశిలో చాలా ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. -4.0 మాగ్నిట్యూడ్ లో ప్రకాశవంతమైన శుక్ర గ్రహాన్ని మేషరాశిలో వీక్షించవచ్చు. 5.8 మాగ్నిట్యూడ్ తో యురేనస్ ను చూడటం కొంచెం కష్టంగా ఉంటుంది. యురేనస్ ను వీక్షించాలనుకునే వారు సరైన ప్రదేశంలో ఉండి మంచి బైనాక్యులర్ వాడితే యురెనస్ ను కూడా చూడొచ్చు. కుజుడు మిథున రాశిలో మొదటి క్వార్టర్ లో చంద్రునికి సమీపంలో ఉన్న అమరికలో చేరినందు వల్ల గుర్తించడం బాగుంటుంది. మార్చి 28వ తేదీన జరగనున్న ఈ ఖగోళ అద్భుతం కొన్ని రోజుల పాటు వీక్షించే వీలుంది. 


ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్కడి నుండి చూడొచ్చంటే?


స్పష్టమైన ఆకాశం, చెట్లు, భవనాలు ఏవీ అడ్డుగా లేకపోతే ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్కడి నుండి అయినా చూడొచ్చు. గురు గ్రహాన్ని, అంగారక గ్రహాన్ని మంచి ప్రదేశం నుండి మాత్రమే చూసే వీలుంది. శుక్ర గ్రహం ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి దీనిని చూడటం చాలా సులభం. యురెనస్ సరైన పరికరాలు లేకుండా చూడటం కష్టం. ఆరెంజ్ హ్యూ ఉన్నప్పుడు నైరుతి దిక్కు నుండి అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చు.