HIV Cases in Tripura: త్రిపురలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో HIV కేసులు పెరుగుతున్నాయని AIDS Control Society వెల్లడించింది. విద్యార్థుల్లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల డేటా ప్రకారం చూస్తే HIV సోకి 47 మంది విద్యార్థులు చనిపోయారు. మరో 828 మందికి వైరస్ సోకినట్టు అధికారికంగా ప్రకటించారు. intravenous డ్రగ్ తీసుకున్న వాళ్లలోనే ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. మొత్తం 220 స్కూల్స్‌, 24 కాలేజీల్లోని విద్యార్థులు HIV బాధితులుగా మారారని స్పష్టం చేశారు. మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే రోజుకు కనీసం 5-7 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే నాటికి రాష్ట్రంలో మొత్తంగా 5,674 HIV కేసులున్నాయి. అందులో 572 మంది విద్యార్థులే ఉన్నారు. 


సంపన్న వర్గానికి చెందిన విద్యార్థులు విపరీతంగా డ్రగ్స్ వాడుతున్నారు. వాళ్లలోనే ఈ HIV వైరస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తల్లిదండ్రులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు అలజడి సృష్టిస్తున్నాయి. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి డేటా సేకరించి అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నాయి. దాదాపు 8,729 మంది Antiretroviral Therapy సెంటర్లలో రిజిస్టర్ అయ్యారు. వీళ్లలో ప్రస్తుతానికి 5,674 మంది బతికే అవకాశముంది. వీళ్లలో 4,570 మంది పురుషులు కాగా, 1,103 మంది మహిళలు.