300 km of bullet train project completed: భారత్ కు తొలి బుల్లెట్ రైలు త్వరలోనే రానుంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మాణఆలు శరవేగంగా జరుగుతున్నాయి.  భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్  అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మాణం అవుతోంది. గరిష్టంగా 320 కి.మీ వేగంతో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. అహ్మదాబాద్ నుంచి ముంబైకు రెండు గంటల్లో రావొచ్చు. 

జపాన్ సహకారంతో చాలా రోజులకిందటే పారంభమైన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. మొత్తంగా  71% పనులు పూర్తయ్యాయి. 352 కి.మీ. పొడవైన రైలు మార్గంలో పనులు చివరి దశలో ఉన్నాయి. 378 కి.మీ.కు పైగా పిల్లర్ల నిర్మాణం పూర్తయింది.   - నర్మదా నదిపై 1.2 కి.మీ. పొడవైన రైల్వే వంతెన సిద్ధమైంది, ఇది దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన.  సూరత్, వడోదర వంటి స్టేషన్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. వయాడక్ట్ మూడు వందల కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయిందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ వీడియో పోస్టు చేశారు.  

మహారాష్ట్రంలో 156 కి.మీ. పొడవైన  ట్రాక్ నిర్మాణం  భూసేకరణ సమస్యల వల్ల నిదానంగా సాగుతోంది.  ముంబైలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) వద్ద అండర్‌గ్రౌండ్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది.   థానే-శిల్‌ఫాటా వద్ద 21 కి.మీ. సొరంగం నిర్మాణం కొనసాగుతోంది, ఇందులో 7 కి.మీ. సముద్రం కింద ఉంటుంది.   24 నదులపై వంతెనల నిర్మాణం జరుగుతోంది, వీటిలో నర్మదా, తప్తి, మహీ వంటి ప్రధాన నదులు ఉన్నాయి.  మొత్తం 7 సొరంగాలు, 28 స్టీల్ వంతెనలు, మరియు 12 స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం కావడానికి కారణంగా భూసేకరణ. ఇప్పటికి గుజరాత్ , మహారాష్ట్రలో అవసరమైన మొత్తం భూసేకరణ పూర్తయింది. జపాన్‌లో తయారైన 24 షింకన్‌సెన్ E5 సిరీస్ రైళ్లు  ఈ ట్రాక్ పై పరుగులు పెట్టనున్నాయి.  రతి రైలులో 10 కోచ్‌లు ఉంటాయి, 750 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. ఇప్పటికే 300 మందికి పైగా భారతీయ రైల్వే సిబ్బంది జపాన్‌లో శిక్షణ పొందుతున్నారు. వడోదరలో హై-స్పీడ్ రైల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్  ప్రారంభించారు.  2026లో సూరత్-బిలిమోరా విభాగంలో మొదటి ట్రయల్ రన్ జరిగే అవకాశం ఉంది.  పూర్తి కారిడార్ 2030 నాటికి సిద్ధమయ్యే అంచనా ఉంది. అయితే కొన్ని విభాగాలు 2028 నాటికి పనిచేయడం ప్రారంభించవచ్చు.  ప్రారంభంలో రోజుకు 35 రైళ్లు నడుస్తాయి, భవిష్యత్తులో 105 రైళ్ల వరకు పెంచే అవకాశం ఉంది.                    

జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నుండి రూ. 88,000 కోట్ల రుణం 0.1% వడ్డీ రేటుతో 50 సంవత్సరాల కాలానికి రుణం అందించంది.  ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌తో పాటు, భారత ప్రభుత్వం మరో 7 హై-స్పీడ్ రైలు కారిడార్‌లను ప్లాన్ చేస్తోంది, వీటిలో ఢిల్లీ-అమృత్‌సర్, ఢిల్లీ-అహ్మదాబాద్,  చెన్నై-మైసూర్ వంటివి ఉన్నాయి. అయితే, ఇవి ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి.