23 Dogs Breeds Banned: దేశవ్యాప్తంగా పలు చోట్ల కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రమాదకరం అని భావించే శునక జాతులపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కుక్కల్ని దిగుమతి చేసుకోవడం, విక్రయించడం, బ్రీడింగ్ చేయడంపై నిషేధం విధించాలని తేల్చి చెప్పింది. ఈ లిస్ట్‌లో Mastiffs, Rottweiler,Pitbull, Terrier సహా మొత్తం 23 రకాల కుక్కలున్నాయి. ఇవి ప్రమాదకరం మాత్రమే కాదని, ఈ శునకాలు దాడి చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. Department of Animal Husbandry అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ నిషేధిత జాబితాలో ఉన్న శునకాల్ని పెంచుకోడానికి ఇప్పటి వరకూ ఇచ్చిన లైసెన్స్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఈ విక్రయాలని నిలిపివేయాలని తెలిపింది. ఇప్పటికే ఈ కుక్కల్ని పెంచుకుంటున్న వాళ్లు..బ్రీడింగ్‌ జరగకుండా వెంటనే స్టెరిలైజేషన్ చేయించాయని ఆదేశించింది. కుక్కల దాడులు పెరుగుతున్న క్రమంలోనే యానిమల్ వెల్ఫేర్‌ గ్రూప్స్‌కి చెందిన నిపుణులతో కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు కూడా ఈ సమస్యని తీవ్రంగా పరిగణించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఈ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ సమర్పించింది. గతంలోనే ఢిల్లీ హైకోర్టు కొన్ని జాతుల కుక్కలపై నిషేధం విధించింది. 


నిషేధం వేటిపైన అంటే..


పిట్‌బుల్ 
టోసా ఇను
అమెరికన్ స్టాఫర్డ్‌షైర్ టెరియర్
ఫిలా బ్రసిలేరియో
డోగో అర్జెంటీనో 
అమెరికన్ బుల్‌డాగ్ 
బోస్‌బోల్ 
కంగల్
సెంట్రల్ ఏషియన్ షెఫర్డ్ డాగ్