Reel Creator Arrest:  సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితో కొంత మంది చెలరేగిపోతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేస్తున్నారు. రైళ్లతో ఎన్ని సార్లు గేమ్స్ ఆడారో చెప్పాల్సిన పని లేదు. తాజాగా యూపీలోని ఉన్నావో అనే ఉళ్లో ఓ యువకుడు ఇలాంటి పిచ్చిపని చేశాడు. రైలు ట్రాక్ మధ్యలో పడుకున్నాడు.అతని పై నుంచి రైలు వెళ్లిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా.. అతని తల ముక్కలయ్యేది. తాను చేసిన పనిని వీడియోగా తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. 

 ఈ రీల్ వైరల్ అయింది.  దీంతో  పోలీసులు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేశారు. యువత ఇలా మారిపోయిందేమిటని సోషల్ మీడియాలో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

సోషల్ మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని కొంత మంది మండిపడుతున్నారు.  

అయితే కొంత మంది మాత్రం అతను ట్రైన్ కింద పడుకోేలదని.. ఫోన్ మాత్రం పెట్టి పక్కకు వెళ్లిపోయాడని.. ఎడిటింగ్ ట్రిక్ చేసి అందర్నీ మభ్య పెట్టాడని అంటున్నారు.  

అతను అలా పడుకున్నా లేకపోయినా.. రీల్స్ కోసం యువతరం బాధ్యత మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. సోషల్మీడియా పిచ్చితో వీరు ఇలా చేస్తున్నారని అంటున్నారు.