AAI JE Recruitment 2025: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ (మ్యాథ్స్, ఫిజిక్స్) అర్హతతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఏఏఐలో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.  అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్ 25 నుంచి మే 24 మధ్య ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేపడతారు. 

అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక అనేది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తయారుచేసిన మెరిట్ జాబితా ప్రకారం జరుగుతుంది. పోస్ట్‌కు వర్తించే విధంగా సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, నేపథ్య ధృవీకరణతో సహా వాయిస్ టెస్ట్‌లో అర్హత సాధించడం,  పోస్ట్‌కు సూచించిన అన్ని ఇతర అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. దరఖాస్తు ధృవీకరణ సమయంలో, అభ్యర్థి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక గుర్తింపు రుజువు మరియు అన్ని సర్టిఫికెట్ల యొక్క స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీల సెట్‌ను సమర్పించాలి. 

షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే పోస్ట్‌కు వర్తించే విధంగా అప్లికేషన్ వెరిఫికేషన్ / వాయిస్ టెస్ట్ / సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్ / సైకలాజికల్ అసెస్‌మెంట్ / ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అని పిలుస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40,000-1,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నవారు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో తప్పనిసరిగా 'నిరభ్యంతర పత్రం (NO OBJECTION CERTIFICATE)' సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. 

వివరాలు.. 

* జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)

ఖాళీల సంఖ్య: 309

పోస్టుల కేటాయింపు: యూఆర్-125, ఈడబ్ల్యూఎస్-30, ఓబీసీ-72, ఎస్సీ-27, ఎస్టీ-55, 

అర్హతలు: డిగ్రీ (మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 

వయోపరిమితి: 24.05.2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఏఏఐలో అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000. మొత్తంగా 13 లక్షల వరకు వార్షిక వేతనం (సీటీసీ) ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభం: 25.04.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 24.05.2025. 

Notification

Website