UP Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

ABP Desam Updated at: 28 Jul 2021 03:48 PM (IST)

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్‌ ప్రాంతంలో లఖ్‌నవూ- అయోధ్య జాతీయ రహదారిపై డబుల్‌ డెక్కర్‌ బస్‌-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు.

UP accident

NEXT PREV

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 20 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.


బారాబంకి జిల్లా రామ్​స్నేహిఘాట్​ ప్రాంతంలోని లఖ్​నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 


ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు మోదీ. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్సను అందజేస్తామని వెల్లడించారు.



బారాబంకీలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతాగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ రాముడ్ని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారందిరికీ సరైన చికిత్స అందించేలా అధికారులను ఆదేశించాను.                 -  యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి


ఏం జరిగింది?


పంజాబ్ లుధియానా నుంచి బిహార్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు మంగళవారం అర్ధరాత్రి బ్రేక్ డౌన్ అవడం వల్ల రోడ్డు పక్కన ఆపారు. బస్సులో ఉన్నవాళ్లు అందరూ వలసకూలీలే. బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్ల చాలామంది బస్సు నుంచి కిందకు దిగి నిల్చున్నారు. అదే సమయంలో ఓ ట్రక్ అతివేగంతో ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రౌమా సెంటర్ లహా బారాబంకి జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు తరలించారు.



బస్సు బ్రేక్ డౌన్ కావడంతో రిపైర్ చేసేవరకు పాసింజర్లను రెస్ట్ తీసుకోవాల్సిందిగా బస్సు డ్రైవర్ చెప్పాడు. అంతలోనే ఓ ట్రక్.. పార్క్ చేసిన బస్సును బలంగా ఢీకొట్టింది. -     సత్యనారాయణ సబత్, లఖ్ నవూ జోన్ ఏడీజీ



బస్సులో ఉన్న చాలా మంది పంజాబ్, హరియాణాలో కూలీ పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నవారే. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో చాలా మంది అక్కడే కింద పడుకున్నారు. అతివేగంతో వచ్చిన ట్రక్కు ఆ బస్సును ఢీ కొట్టింది. ఘటనలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. చాలా మంది బస్సులో ఇరుక్కుపోయారు.            - ఏబీపీతో డీజీఏ సబత్

Published at: 28 Jul 2021 09:19 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.