Breaking News Live Telugu Updates: ఎస్సై సెలక్షన్‌లో అపశృతి- గుంటూరులో పరుగెడుతూ అభ్యర్థి మృతి
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
ABP Desam Last Updated: 15 Sep 2023 03:18 PM
Background
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల వేళ నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన గురువారం (సెప్టెంబరు 14) ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ విషయం గురించి నారా లోకేశ్ జాతీయ...More
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల వేళ నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన గురువారం (సెప్టెంబరు 14) ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ విషయం గురించి నారా లోకేశ్ జాతీయ మీడియాతో రేపు (సెప్టెంబరు 15) మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోకేశ్ జతీయ మీడియాకు వివరించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.అంతేకాక, చంద్రబాబుపై అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి కూడా నారా లోకేశ్ చర్చించనున్నారు. అటు పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం వేసింది. అందుకోసం చంద్రబాబు అరెస్ట్ పై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేశ్ మాట్లాడనున్నారు. నేటి వెదర్ రిపోర్ట్‘‘నిన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి, ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని ఉత్తర ఒడిశా & పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ. వరకు వ్యాపించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకి వాలి ఉంది. ఇది రాగల 2 రోజులలో ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుండి అతిభారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని (ఉత్తర) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.హైదరాబాద్‌లో వాతావరణంహైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 06 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 82 శాతంగా నమోదైంది.ఏపీలో ఇలాఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగముతో వీయవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రగతి భవన్లో కొనసాగుతోన్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులతో చర్చిస్తున్నారు.