Guinness World Record for hairiest face: మధ్యప్రదేశ్‌లోని లలిత్ పటిదార్ అనే యువకుడు గిన్నిస్ రికార్డులకు కెక్కాడు. ఇందు కోసం అతను ఏమీ చేయలేదు. అతనికి ఉన్న సమస్య కారణంగానే ఈ రికార్డులకు ఎక్కాడు. అతని సమస్య ఏమింటటే.. ముఖం మొత్తం వెంట్రుకలు మెలిచేయడం. కళ్లు, పెదాలపై తప్ప అంతా జుట్టు వచ్చేస్తోంది. రోజూ షేవింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తోంది కానీ తగ్గడం లేదు. దాంతో అలా వదిలేశాడు. అలా వదిలేయడం వల్ల గిన్నిస్ రికార్డు వచ్చింది. హెయిరీయస్ట్  ఫేస్ గా ప్రపంచంలో నెంబర్ వన్ గా గిన్నిస్ రికార్డులకు ఎక్కాడు.

వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్  ఉండటం వల్ల జుట్టు పెరుగుదల         

లలిత్ పటీదార్‌కు హైపర్‌ట్రికోసిస్ ,  వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్  ఉండటం వల్ల  శరీరంలోని వివిధ భాగాలలో అసాధారణంగా జుట్టు పెరుగుదల ఉంటోంది.  ఈ అరుదైన సిండ్రోమ్. సాధారణంగా జుట్టు ఎక్కడ ఎక్కువ పెరగదో అక్కడే పెరుగుతుంది. ఇలాంటి సిండ్రోమ్ రావడానికి కారణం ఏమిటన్నది పరిశోధకులు ఇంత వరకూ తెలుసుకోలేకపోయారు. అసాధాణంగా అతి కొద్దిమందికి వచ్చే ఈ సిండోర్మ్ గురించి  విస్తృతంగా పరిశోధన చేసి  రెండు కారణాలుగా గుర్తించారు. అందులో ఒకటి   పుట్టుకతో వచ్చే హైపర్ట్రికోసిస్, అలాగే తర్వతా వచ్చే   అక్వైర్డ్ హైపర్ట్రికోసిస్ గా అంచనాకు వచ్చారు. 

వంశపారంపర్యంగా .. వచ్చే సిండోమ్ గా గుర్తింపు                  

పుట్టుకతో వచ్చే హైపర్‌ట్రికోసిస్ కేసులలో  వంశపారంపర్యంగా సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు.  కొన్ని నిద్రాణమైన జన్యువులు ఊహించని విధంగా క్రియాశీలకంగా మారడం వల్ల ఇది సంభవిస్తుందని వైద్య నిపుణులు తేల్చారు. .  ప్రారంభ మానవ పూర్వీకులలో విస్తృతమైన శరీర వెంట్రుకలకు కారణమైన ఈ జన్యువులు, ఆధునిక మానవులలో సాధారణంగా కనిపించవు. కానీ పుట్టుకతో వచ్చే హైపర్‌ట్రికోసిస్ ఉన్న వ్యక్తులలో ఈ పురాతన జన్యు గుర్తులు పిండం అభివృద్ధి సమయంలో తిరిగి యాక్టివ్ అవుతున్నాయని అంచనాకు వచ్చారు. అసలు ఇవి ఎందుకు యాక్టివ్ అవుతున్నాయన్నది  కొంతమంది వ్యక్తులు ఈ జన్యు మార్పును ఎందుకు అనుభవించాల్సి వస్తుందో పరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.       

చికిత్స ఏమిటో ఇంత వరకూ కనిపెట్టలేకపోయిన శాస్త్రవేత్తలు                             

హైపర్‌ట్రికోసిస్ అనేది అరుదైన వైద్య  విషయంగా మిగిలిపోయింది.   ఖచ్చితమైన నివారణ లేనప్పటికీ, లేజర్ హెయిర్ రిమూవల్, షేవింగ్ ,  కొన్ని మందులు వంటి చికిత్సలు అధిక జుట్టు పెరుగుదలను తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి. కానీై పూర్తి స్తాయిలో నివారించలేకపోతున్నారు.ఇలాంటి సమస్య ఉన్న వారిలో తీవ్రత కూడా తేడాలు ఉన్నాయి. లలిత్ పటీదార్‌కు.. సింహాం తరహాలో జుట్టు విపరీతంగా పెరగడంతో ఆయనకు గిన్నిస్ రికార్డు వచ్చింది.

Also Read: Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?