Pani Puri Health Benefits: మనం పానీ పూరి అని పిలిస్తే.. ఉత్తర భారతంలో గోల్ గప్ప అని పిలుస్తారు. ఇది మనదేశంలో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం అలా బయటకు వెళ్లే వాళ్లలో చాలామంది పానీపూరి తినే ఇంటికి వస్తారు. రుచికూడా సూపర్బ్ గా ఉంటుంది. అందుకే పానీపూరికి అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. ఉడికించిన బంగాళాదుంపలు, పుదీనా నీటితో తినే పానీపూరి రుచి నోటికి అద్భుతంగా ఉంటుంది. కాలం ఏదైనా సరే పానీ పూరి తినాల్సిందే. అందుకే పానీపూరి అంత ప్రజాదరణ పొందింది. అయితే పానీపూరీ కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని అందించే ఔషదం కూడా. ఇది బెస్ట్ డైట్ ఫుడ్స్ లో ఒకటని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు అధిక బరువుతో బాధపడుతుంటే.. బరువు తగ్గడంలో మీకు ఎంతో సహాయపడుతుంది. అదేంటీ అంతా పానీపూరి ఆరోగ్యకరం కాదని చెబుతుంటే.. మీరు చాలా హెల్తీ అంటున్నారనేగా మీ సందేహం. ఎందుకంటే.. పానీపూరీ వల్ల వచ్చే రోగాలు అపరిశుభ్రమైన ప్రదేశాలు, అందులో కలిపే నీరు, దాన్ని తయారు చేసే వ్యాపారి శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు చిన్న పూరీలు బయట కొనుగోలు చేసుకుని, అందులో రసాన్ని మాత్రం ఇంట్లోనే తయారు చేసుకుని పానీపూరీ ఆస్వాదించండి. మరి, పానీపూరీ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూసేద్దామా.
డయాబెటిక్ పేషెంట్లకు మంచిది:
వయస్సుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ సమస్యగా మారింది. మధుమేహంతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. షుగర్ కు మందులు లేనప్పటికీ.. దీనిని ఆహారం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. మీరు మీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. మీరు తీపి ఆహారాలకు దూరంగా ఉండటంతోపాటు అధిక కేలరీలు ఉన్న వాటికి కూడా దూరంగా ఉండాలి. పానీపూరీ తక్కువ కేలరీలు ఉన్న ఆహారం. ఇందులో తియ్యటి చట్నీతో కూడా తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్ పెద్దగా చింతించకుండా ఈ చిరుతిండిని పూర్తిగా ఆస్వాదించవచ్చు. అయితే అతిగా తినకుండా కొంచెం తినడం ముఖ్యం. మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది.
విటమిన్లు, ఖనిజాలు:
పానీపూరి మీకు అవసరమైన పోషకాలను సరళమైన మార్గంలో అందిస్తుంది. పూనీపూరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. పానీపూరీలో మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్, జింక్, విటమిన్లు A, B-6, B-12, C, D ఉంటాయి. పానీపూరీ కోసం ఉపయోగించే రసంలో కలిపే పదార్థాల ద్వారా ఇవన్నీ అందుతాయి.
నోటి బొబ్బలకు చెక్:
అనేక నివేదికల ప్రకారం పానీపూరి మీ నోటిలోని బొబ్బలను నయం చేస్తుంది. నోటిలో పుండ్లకు చికిత్స చేసే అవకాశం ఉన్న జల్‌జీరా, పుదీనా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. నోటికి సంబంధించిన ఇలాంటి సమస్యలకు వాటి ఘాటైన ఫ్లేవర్ గ్రేట్ గా సహాయపడుతుంది.
ఎసిడిటీని నయం చేస్తుంది:
ఎసిడిటీతో బాధపడుతున్నవారు పానీపూరి తింటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే జల్గీరా నీటిలో అనేక ఇతర అంశాలు ఉంటాయి. ఇది అసిడిటీపై ప్రభావం చూపుతుంది. ఎసిడిటిని వదిలించుకోవాలంటే పానీపూరిను తినవచ్చు. పుదీనా, పచ్చిమామిడి, నల్లఉప్పు, నల్లమిరియాలు, జీలకర్ర , ఉప్పు ఇందులో ఉంటాయి. ఇవి ఎసిడిటిని నయం చేస్తాయి.
మూడ్ రిఫ్రెషర్:
వేసవి కాలం లేదా శీతాకాలం అనే తేడా లేకుండా పానీపూరీ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ, పానీపూరీలు ఎక్కువగా వేసవిలో తినడానికి ఇష్టపడుతుంటారు. ఉష్ణోగ్రత మిమ్మల్ని నిర్జలీకరణం, అనారోగ్యానికి గురిచేస్తున్నట్లు అనిపించినప్పుడు..మీరు ఎక్కువ నీరు త్రాగాలి. సాధారణ నీటిని పానీపూరి నీటితో భర్తీ చేయడం వల్ల మీరు కొద్దిగా శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ఉంటారు.
Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.