World Photography Day 2025 : ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ డే జరుపుకుంటారు. ఫోటోగ్రఫీ అంటే కేవలం ఫోటో తీయడమే కాదు.. మధురమైన క్షణాలను నిలబెట్టగలిగే ప్రత్యేకమైన కళ అది. అందుకే సైకాలజిస్టులు కూడా ఫోటోగ్రఫీని హీలింగ్ థెరపీగా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఈరోజుల్లో చేతిలో ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఫోటోగ్రాఫర్‌లా ఫీల్ అవుతారు. కానీ ఇది హాబీగా కాకుండా నిజంగానే ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉంటే.. దానిని కెరీర్ ఆప్షన్‌గా మార్చుకునేందుకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
ఫోటోగ్రఫీని కెరీర్‌గా మలచుకునేందుకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫి నుంచి.. ఎన్నో కథలను, వాస్తవాలను ఫోటోజర్నలిజం ద్వారా చెప్పే సౌలభ్యం ఉంది. అందుకే దీనిని చాలామంది వృత్తిపరంగా ముందుకు వెళ్లేందుకు ఎంచుకుంటున్నారు. ఇండియాలో ఫోటోగ్రఫీని అందించే బెస్ట్ ఇన్స్టిట్యూట్లు ఏంటో.. ఏ కోర్సులు మంచివో చూసేద్దాం.
ఫోటోగ్రఫీ కెరీర్‌కు మంచిదేనా?
గతంలో ఫోటోగ్రఫీ కేవలం హాబీగానే చూసేవారు. కానీ ఇప్పుడు మనముందు ఉన్నది డిజిటల్ మీడియా. ఈ సమయంలో ఫోటోగ్రఫీకి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. మీడియా, ఫ్యాషన్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వల్ల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్లరకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. కాబట్టి దీనిని కెరీర్‌గా ఎంచుకోవడం మంచిదే అవుతుంది.
ఇండియాలో బెస్ట్ ఫోటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) : అహ్మదాబాద్‌లోని ఈ ఇన్స్టిట్యూట్లో డిజైన్ కోర్సుల్లో భాగంగా ఫోటోగ్రఫీ, విజువల్ కమ్యూనికేషన్లో అవసరమైన మాడ్యూల్స్ అందిస్తారు. ఇక్కడ ప్రపంచ స్థాయి సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉంటారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) : పుణేలోని దీనిలో సినిమాటోగ్రఫీ, స్టిల్ ఫోటోగ్రఫీకి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల్లోకి వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
జామియా మిలియా ఇస్లామియా (AJK Mass Communication Research Centre) : న్యూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా మాస్ కమ్యూనికేషన్లో అగ్రశ్రేణిగా నిలిచింది. విజువల్ కమ్యూనికేషన్, ఫోటోగ్రఫీ కోర్సులు ఇక్కడ ఉంటాయి.
ఫోటోగ్రఫీకి ఈ కోర్సులు బెస్ట్
- సర్టిఫికేట్ కోర్సులు : షార్ట్-టర్మ్, ప్రాక్టికల్ బెస్డ్ ట్రెయినింగ్
- డిప్లొమా కోర్సులు – 1–2 సంవత్సరాల ప్రత్యేక శిక్షణ.
లైట్ & లైఫ్ అకాడమీ : ఊటీలోని ఈ అకాడమీ భారతదేశంలోనే తొలి ప్రత్యేక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఇనిస్టిట్యూట్. దీనిని ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఇక్బాల్ మహమ్మద్ స్థాపించారు. ఇక్కడ డిప్లొమా, కస్టమైజ్డ్ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి.
ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఇక్కడ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. వెడ్డింగ్, ఫ్యాషన్, కమర్షియల్ ఫోటోగ్రఫీకి ఇది ప్రసిద్ధి చెందినది.
ముంబైలోని Sir J. J. Institute of Applied Art కమర్షియల్, అడ్వర్టైజింగ్ ఫోటోగ్రఫీకి బెస్ట్ ప్లేస్. ముంబైలోనే ఉన్న National Institute of Photographyలో మీరు సర్టిఫికేట్,డిప్లొమా ప్రోగ్రాముల ఫాలో అవ్వట్లేదు. వీటిలో మీరు జాయిన్ అయి ఫోటోగ్రఫీ నేర్చుకుని కెరీర్‌గా మలచుకోవచ్చు.