Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్‌లు విరూపాక్షి దగ్గర డబ్బు దొంగతనం చేసి ఇరికించాలని అనుకోవడం మందారం వినేస్తుంది. మీ పని చెప్తా అని అనుకుంటుంది. విరూపాక్షి, రాజు, రూప, బంటీలు మాట్లాడుకుంటారు. కోమలిని ఓ ఆట ఆడుకున్నామని బంటీ మొత్తం చెప్తాడు. నలుగురు నవ్వుకుంటారు.
బంటీ అమ్మమ్మతో మా అమ్మని ఇబ్బంది పెడితే నేను ఊరుకుంటానా ఆవిడతో ఓ ఆట ఆడుకున్నామని అంటాడు. విరూపాక్షి రూపతో ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఇక మందారం వచ్చి విరూపాక్షిని ఇరికించడానికి విజయాంబిక చేసిన ప్లాన్ గురించి చెప్తుంది. విజయాంబికకు సరైన గుణపాఠం చెప్పాలి అనుకుంటారు. మరోవైపు జీవన్ కోమలి లవర్ అశోక్‌తో మాట్లాడుతాడు. రాత్రి దీపక్, విజయాంబికలు బయటకు వస్తారు. విజయాంబిక విరూపాక్షి గదిలోకి వెళ్తుంది. విరూపాక్షి గమనించి విజయాంబిక అయిపోయావే చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది.
విజయాంబిక డబ్బులు కోసం చేయి పెడుతుంది. దాంతో విజయాంబికకు తేలు కుడుతుంది. విజయాంబిక కేకలు అందరూ విరూపాక్షి గదిలోకి చేరుకుంటారు. విరూపాక్షి విజయాంబికతో ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తాన్నావ్ దొంగతనం చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. రూప వాళ్లు నవ్వుకుంటారు. ఈ టైంలో నా గదిలోకి ఎందుకు వచ్చావ్ చెప్పు అని అడుగుతుంది. దాంతో విజయాంబిక ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్లమని అంటుంది. నేను ఒప్పుకోను నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని విరూపాక్షిఅంటుంది. సూర్యప్రతాప్ ముందు విజయాంబిక గోల చేయడంతో సూర్యప్రతాప్ డాక్టర్‌ని పిలవమని రాజుతో చెప్తాడు. ఇక దీపక్ విని ఇప్పుడు నేను వెళ్తే నన్ను మా అమ్మ ఇరికించేస్తుంది నేను వెళ్లను అని అనుకుంటాడు.
సూర్యప్రతాప్ కూడా ఈ టైంలో నీకు ఏం పని దొంగతనానికి వచ్చావా అని అడుగుతాడు. రూప కూడా అత్త గదిలోకి వచ్చినా బీరువా తాళాలు ఉన్న బాక్స్‌లో చేయి పెట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది. అదీ ఇదీ అని విజయాంబిక అంటే దొంగతనం చేయడానికి వచ్చావా అని సూర్యప్రతాప్ అడుగుతాడు. నేను ఉన్న గదిలో దొంగతనం చేస్తే నన్ను దొంగలా చెప్పి ఇంటి నుంచి గెంటేయాలి అనుకున్నావ్ అంతే కదా అని విరూపాక్షి అంటుంది. ఇంతలో డాక్టర్ రావడంతో తర్వాత చెప్తా ముందు డాక్టర్ దగ్గరకు వెళ్దామని విజయాంబిక అంటుంది. అందరూ హాల్‌లో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్తారు.
విజయాంబికకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. చేతికి క్లాత్ కట్టిమని చెప్తారు. వాంతులు, విరేచనాలు అవుతాయి పర్లేదు చూసుకోండి అంటారు. ఇక రూప అత్తని ఇరికించడానికి కుంకుడు కాయల రసం తాగిలి అని రకరకాల ట్రీట్మెంట్‌లు చెప్తుంది. పడుకోకూడదు అని పడుకుంటే విషం తలకు ఎక్కుతుందని అంటారు. రూప చెప్పినవన్నీ చేస్తే నా పని అయిపోతుందని విజయాంబిక అనుకుంటుంది. ఇక రూప అయితే మా అమ్మ గదిలోకి ఎందుకు వచ్చిందో అడగమని అంటుంది. కొంగ తీసి ఆ తేలు అత్తయ్య తెచ్చి అమ్మ మీద వదిలేయాలని తీసుకొచ్చినట్లు ఉంది నాన్న అని రూప అంటుంది. ఈ నిజం తేలే వరకు నేను వదలను అని సూర్యప్రతాప్ అంటాడు. విజయాంబిక నిద్ర పోకుండా చూసుకోమని అంటారు. నేను చూసుకుంటా అని రూప అంటుంది. నిద్రోస్తుందని విజయాంబిక అంటే రూప లాగి పెట్టి కొడుతుంది. అలా కొడితే చనిపోతుందని కోమలి అంటుంది. ఇక మందారానికి వేడి నీళ్లు తెమ్మని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.