Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పండు మీద రత్నబాబుకి అనుమానం వస్తుంది. పండుని చెక్ చేయమని తన మనిషికి చెప్తాడు. పండు దొరికిపోయాడు అనుకునే టైంకి లక్ష్మీ రూం సర్వీస్‌లా గెటప్ వేసి మాస్క్ పెట్టుకొని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది.
రత్నబాబు ఎవరు అని అడిగితే రూం సర్వీస్ అని అంటుంది. ఇక పండుని చూసి ఏయ్ సత్తిబాబు నీకు ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు కదా అప్పుడే ఎందుకు వీఐపీ రూమ్స్‌కి వచ్చావ్ అని అడుతుంది. ఇక ఫారెన్ వాడు లక్ష్మీని చూసి చాలా బాగుందని ముఖం చూడాలని మాస్క్ చేయమని అంటాడు. దాంతో లక్ష్మీ నేను మీరు అనుకునే అమ్మాయిని కాదు అని చెప్తుంది. దాంతో రత్న బాబు తన మన గల్ కాదని అంటుంది. మరోవైపు పండు సీక్రెట్‌గా స్పై కెమెరాని ప్లవర్ వాజ్‌కి అతికిస్తాడు. ఇక లక్ష్మీ వేరే వెయిటర్‌ని పంపిస్తానని పండుని తీసుకెళ్లిపోతుంది. రత్నబాబు వాళ్లు మాట్లాడుకుంటారు.
విహారి లక్ష్మీ తనతో సరిగా మాట్లాడటం లేదని లక్ష్మీతో మాట్లాడాలని గదిలోకి వెళ్తాడు. విహారి లక్ష్మీ అని పిలుస్తాడు. అక్కడ వసుధ ఉండటంతో విహారిని చూసి చాలా భయపడుతుంది. సరిగ్గా విహారి కనకం అని తట్టి లేపే టైంకి యమున వచ్చి విహారి అని పిలుస్తుంది. విహారి చేయి పట్టుకొని తీసుకొని బయటకు వెళ్లిపోతుంది. ఏంట్రా ఒక ఆడపిల్ల గదిలోకి ఈ టైంలో వెళ్తున్నావ్ అని అంటుంది. దాంతో ఆఫీస్ పని అని విహారి అనేస్తాడు. ఏం ఉన్నా ఉదయం చూసుకో అంటుంది. అంబిక చూసి ఈ టైంలో విహారికి ఏం ఆఫీస్ పని ఉందని అనుకుంటుంది.
రత్నబాబు వాళ్లు మాట్లాడుకుంటుంటే లక్ష్మీ వాళ్లు ల్యాప్‌టాప్‌లో చూస్తుంటారు. అయితే అందులో రత్నబాబు ముఖం కనిపించదు. లక్ష్మీ అదంతా పెన్‌డ్రైవ్‌లో ఎక్కించి ఇక రత్నబాబు పని అయిపోయింది అనుకుంటుంది. పెన్‌డ్రైవ్ తీసుకొని వెళ్తుంటే రత్నబాబు మరో లేడీని ఆపి ఐస్‌క్యూబ్స్ చెప్తే ఇంకా రాలేదు అని అంటే ఆ లేడీ మాకు ఏం ఆర్డర్ రాలేదని చెప్పి మళ్లీ ఇస్తాను అంటుంది. మరోవైపు అంబిక లక్ష్మీ బయట నుంచి రావడం చూసి ఇదేంటి బయట నుంచి వస్తుంది ఇది నా కళ్లు కప్పి బయటకు వెళ్లిందా అనుకుంటుంది. లక్ష్మీ వాళ్లని ఫాలో అవుతుంది. చారుకేశవ వసుధని లేపడం అందరూ కలిసి డ్రామా చేశారని అనుకుంటుంది. రత్నబాబు సంబంధించి సాక్ష్యం కలెక్ట్ చేసిందని అంబికకు తెలిసిపోతుంది. అంబికకు రత్నబాబు కాల్ చేసి ఆ లక్ష్మీ మనతో గేమ్ ఆడింది ఇంట్లో ఉన్నట్లు క్రియేట్ చేసి మమల్ని మోసం చేసింది. తన చేతిలో పెన్ డ్రైవ్ ఉందని చెప్తుంది. ఆ లక్ష్మీని చంపి అయినా ఆ పెన్ డ్రైవ్ తీసుకో అని అంటాడు. రేపు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు అవసరం అయితే చంపేయ్ అని అంబిక అంటుంది.
లక్ష్మీ మనసులో విహారి గారికి విడాకులు ఇవ్వమని యమునమ్మ చెప్తారు ఆ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని లక్ష్మీ మనసులో అనుకుంటుంది. పండు, చారుకేశవ, వసుధ, లక్ష్మీలు విహారి లక్ష్మీల బంధం గురించి మాట్లాడుకుంటారు. ఆ పైవాడే మార్గం చూపిస్తాడు అని లక్ష్మీ అంటే విహారి వచ్చి చూపించడు నేను నిజం చెప్తేనే నీకు నాకు గండం తప్పిపోతుందని అంటాడు. అందరికీ నిజం చెప్పేద్దాం అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.