World Milk Day Significance : ప్రపంచవ్యాప్తంగా పాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. పాడి పరిశ్రమను ప్రోత్సాహించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2001లో ఐక్యరాజ్యసమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) సంస్థ ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఏటా పాలు, పాల ఉత్పత్తుల ప్రయోజనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. దీనివల్ల పాడిపరిశ్రమ అభివృద్ధి చెంది.. ఎందరికో జీవనోపాధి పొందేలా చేయడమే లక్ష్యంగా మిల్క్ డేని నిర్వహిస్తున్నారు.
మిల్క్ డే చరిత్ర ఇదే
పొలంలో లేదా ఇంటి దగ్గర్లో చాలామంది పాలను అమ్ముతూ జీవనం కొనసాగిస్తారు. రైతులు కూడా పొలానికి ప్రత్యామ్నాయంగా.. ఇలాంటి పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. వారికి సోర్స్ ఆఫ్ ఇన్కామ్ దాదాపు వీటినుంచి ఉంటుంది. ఈ అంశాలను గుర్తుపెట్టుకుని.. పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో World Milk Dayని చేస్తున్నారు. పాలు, మిల్క్ ప్రొడెక్ట్స్ అంటే ఎలర్జీతో చాలామంది పాలకు దూరమవుతున్నారు. వీగన్ అనే పేరుతో మరికొందరు డైయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. వారందరికీ ఈ పాల ప్రాముఖ్యతను వివరించేందుకు World Milk Day 2024ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది థీమ్ ఇదే..
పాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. పాడి పరిశ్రమ అభివృద్ధికై.. ఏటా వరల్డ్ మిల్క్ డే రోజు ఓ థీమ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం (World Milk Day 2024) సందర్భంగా.. సరసమైన ధరల్లో.. పోషకాలు అధికంగా ఉండే మిల్క్, మిల్క్ ప్రొడెక్ట్స్‌ను సమతుల్య ఆహారంలో భాగంగా చేయడమే లక్ష్యంగా ఈ ఏడాది థీమ్‌ను నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి నాణ్యమైన పోషకాహారం అందుతుంది.
పాల దినోత్సవం ప్రాముఖ్యత ఇదే..
ప్రపంచ ఆహారంగా పాలు ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2001 నుంచి దీనిని ప్రతి ఏటా జూన్ 1వ తేదీన పాటిస్తున్నారు. ఇది కేవలం పాల ప్రాముఖ్యతనే కాకుండా పాడి పరిశ్రమ అభివృద్ధిని కూడా లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. దీనివల్ల కలిగే ఉపాధి ఎందరికో జీవనాధారంగా మార్చడమే దీని ప్రాముఖ్యత.
వివిధ పరిశ్రమల్లో అభివృద్ధి
పాలపై అవగాహన, పాడి పరిశ్రమ అభివృద్ధిపై వివిధ సభలు నిర్వహించవచ్చు. పిల్లల నుంచి పెద్దలవరకు దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేవచ్చు. ఆరోగ్యానికే కాకుండా.. అందానికి పాడిపరిశ్రమకు కలిగే లాభాలు తెలిపవచ్చు. ఖాళీగా ఉండేవారికి జీవనోపాధిని చూపించవచ్చు. ఎందుకంటే పాలు కేవలం పాడి పరిశ్రమకే కాకుండా.. బ్యూటీకోసం పలు క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లో ఉపయోగిస్తున్నారు. కాబట్టి బ్యూటీ పరిశ్రమలో, కొన్ని రకాల కాస్మోటిక్ చికిత్సలో దీనిని వినియోగించవచ్చు. సోషల్ మీడియాలో కూడా పాలు, పాల ఉత్పత్తులపై అవగాహన కల్పించవచ్చు. #WorldMilkDay #EnjoyDairy వంటి వాటితో స్టోరీలు పోస్ట్ చేయచ్చు. పాలతో ఏదొక వంటను చేసుకుని ఇంటిల్లీపాది హాయిగా లాగించవచ్చు.
Also Read : కాఫీలో నెయ్యి వేసుకుని నెలరోజులు తాగితే బరువు తగ్గుతారట.. నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే