డయాబెటిస్ అంటే ఒక దరిద్రం. ఇది పట్టుకుందంటే.. జీవితం నాశనం. మనం గానీ సరిగ్గా డైట్ పాటించకపోతే రకరకాల రోగాలను క్రియేట్ చేస్తుంది. చివరికి డాక్టర్లు కనుగోలేని కొత్త రోగాలను కూడా పుట్టించేస్తుంది. శతకోటి దరిద్రాలకు అనంతర కోటి ఉపాయాలు అని మని పెద్దలు చెబుతుంటారు. కానీ, డయాబెటిస్ వంటి దరిద్రానికి ఎన్ని ఉపాయాలు వేసినా వేస్టే. మనం చేయాల్సిందల్లా.. డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడటం. ఒక వేళ వచ్చిందంటే సరైన డైట్ పాటించడం ద్వారా క్రమేనా ఆయుష్షును కాపాడుకుంటూ ముందుకు వెళ్లడం. అయితే, చాలామందిలో మరో డౌట్ ఉంటుంది. కానీ, బయటకు చెప్పుకోడానికి సిగ్గు. అదే.. సుఖజీవితం. మరి డయాబెటిస్‌తో బాధపడుతున్న స్త్రీ, పురుషుల లైంగిక జీవితంపై డయాబెటిస్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రమాదకరం?


ఆ సామర్థ్యం తగ్గుతుందా?


డయాబెటిస్ ఎప్పుడు ఎలాంటి రోగాలను క్రియేట్ చేస్తుందో చెప్పలేం. అలాగే.. అప్పటివరకు నేను తోపు అని తిరిగేవాడిని సైతం తుప్పులా మార్చేస్తుంది. అంతేకాదు.. పురుషుల సామర్థ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతాయి. డయాబెటిస్ వల్ల రోగుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోతాయట. దాని వల్ల అంగస్తంభన లోపం (Erectile Dysfunction - ED) ఏర్పడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. అంగస్తంభన జరగాలంటే రక్తప్రసరణ సక్రమంగా ఉండాలి. అయితే, డయాబెటిస్ వల్ల రక్త నాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా పురుషాంగానికి చేరే రక్తం సక్రమంగా అందకపోవడం వల్ల స్తంభన సమస్యలు ఏర్పడతాయి. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఈ సమస్య అధికం.  అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా 10 నుంచి 20 శాతం అంగస్తంభన సమస్యల కేసులు ఒత్తిడి, లైంగిక వైఫల్యం, భయాలు, మానసిక సమస్యలు వల్ల ఏర్పడుతుంటాయి. అయితే, మధుమేహం ఉన్నవారికి ఆ స్థాయి మరింత ఎక్కువ ఉంటుంది. అయితే, డయబెటిస్ స్త్రీ, పురుషులకు ఇద్దరికీ ప్రమాదకరమే. కానీ, సమస్యలు, సైడ్ ఎఫెక్టుల్లో కాస్త తేడా ఉంటుంది.


మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తాయ్?


రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నట్లయితే.. రక్త నాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల మహిళల్లో లైంగిక ప్రేరణ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్రేకాన్ని అనుభవించే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే యోని నుంచి లిక్విడ్స్ కూడా రిలీజ్ కావు. దానివల్ల అక్కడ డ్రైగా ఉంటుంది. ఆ ప్రాంతం పొడిబారడం వల్ల కయికలో నొప్పి కలుగుతుంది. ఫలితంగా శృంగారమంటేనే భయపడిపోయే పరిస్థితి రావచ్చు. రుతుక్రమం సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. అలాగే కలయిక సమయంలో మహిళ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. దానివల్ల అసౌకర్యానికి గురికావచ్చు. కాబట్టి, భాగస్వామితో కలవడానికి ముందు స్త్రీలు తప్పకుండా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్న మహిళలు థ్రష్, సిస్టిటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు గురికావచ్చు. ఇవన్నీ లైంగిక సంపర్కాన్ని నరకంగా మార్చేస్తాయి. పైగా డయాబెటిస్ వల్ల స్త్రీ, పురుషులు తీవ్రమైన అలసటకు గురవ్వుతారు. ఎక్కువ సేపు లైంగిక చర్యలో పాల్గొంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి, కలయికలో పాల్గొనే ముందు తప్పకుండా షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.


Also Read: డయాబెటిస్ వస్తుందేమోనని భయమేస్తుందా? ఈ 10 జాగ్రత్తలు పాటిస్తే.. రానే రాదు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.