World Cancer Day 2025 Theme and Significance : క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 2025లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day 2025) మంగళవారం వచ్చింది. క్యాన్సర్ నివారణ, గుర్తించడం, చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం. క్యాన్సర్ వల్ల కలిగే సమస్యలను చెప్తూ.. క్యాన్సర్‌ని దూరం చేసుకునేందుకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తూ.. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తారు.
క్యాన్సర్‌ని ముందుగానే గుర్తిస్తే చికిత్సతో క్యూర్ చేసుకోవచ్చు. కానీ దానిపై సరైన అవగాహన లేక ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ డే చేస్తున్నారు. అసలు ఈ క్యాన్సర్ డే ప్రాముఖ్యత ఏంటి? దాని చరిత్ర, ఎలాంటి మార్పులు చేస్తే క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు? రాకుండా నిరోధించవచ్చు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్ దినోత్సవం ప్రాముఖ్యత
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సాహించడమే దీని ప్రాముఖ్యత. హెల్తీ లైఫ్‌స్టైల్‌తో క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చని.. ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శారీరక శ్రమ, జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలో నిపుణులు సూచిస్తారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్..
ప్రతి సంవత్సరం క్యాన్సర్ డేని ఒక్కో థీమ్‌తో చేస్తారు. ఈ ఏడాది 'యునైటెడ్ బై యూనిక్' అనే థీమ్‌ని తీసుకొచ్చారు. క్యాన్సర్‌ను దూరం చేసి వివిధ అంశాలపై దృష్టి సారించడమే దీని లక్ష్యం. 2025-2027 వరకు ఈ థీమ్‌ని ఫాలో అవుతారు.
క్యాన్సర్ నివారణ చర్యలు
ప్రమాద కారకాలను తగ్గించడం వల్ల 30 నుంచి 50 శాతం క్యాన్సర్లను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందుకే లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేస్తే క్యాన్సర్‌ని దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
పోషకాహారం
బయటతినే ఫుడ్స్, సింథటిక్ కలర్స్, అన్‌హెల్తీ ఫుడ్ క్యాన్సర్ కారకాలను పెంచుతుంది కాబట్టి. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో నిండి ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఇవి క్యాన్సర్ల నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి. షుగర్‌ని కూడా కట్ చేస్తే మంచిది.
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండడంలో బరువు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అధిక బరువు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది కాబట్టి.. బరువును తగ్గేందుకు శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామ చేయడం మంచిది. కనీసం వారానికి 150 నిమిషాలు అయినా వర్క్అవుట్ చేసేలా చూసుకోవాలి.
పొగాకు, మద్యం
క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగాకు. ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందుకే ధూమపానాని దూరంగా ఉండడం కాదు పూర్తిగా మానేయాలని చెప్తున్నారు. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్, బ్రెస్ట్, అన్నవాహిక క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కూడా తగ్గించడం లేదా మానేస్తే మంచిది.
సూర్యరశ్మి నుంచి జాగ్రత్త
ఎండతో విటమిన్ డి అందుతుంది ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ.. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మానికి అస్సలు మంచివి కావు. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా.. వెళ్లినా చర్మాన్ని రక్షించుకునేలా డ్రెస్‌లు వేసుకోవాలి. దీనివల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాలు తగ్గుతాయి.
ఇవే కాకుండా ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ ఫాలో అయితే మంచిది. రెగ్యులర్‌గా మెడికల్ చెకప్‌లు చేయించుకోవాలి. దీనివల్ల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. HPV టీకాలు తీసుకుంటే గర్భాశయ, ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గుతుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కాలేయ క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. ఇలాంటి వ్యాక్సిన్లు గురించి తెలుసుకోవాలి. ఈ మార్పులు చేస్తూ.. హెల్తీగా ఉంటే క్యాన్సర్‌ను ఈజీగా దూరం చేసుకోవచ్చు.
Also Read : పెర్ఫ్యూమ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త సంతాన సమస్యలు రావొచ్చు.. రూమ్ ఫ్రెషనర్స్తో కూడా