కరోనా తర్వాతా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోంకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది చాలా మందికి ఆనందం కలిగిస్తున్నప్పటికీ కలిగే దుష్ఫలితాలపై నిపుణుణలు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. 


ఆఫీస్‌కు వెళ్లి వర్క్‌ చేసే ఉద్యోగులు నిర్దేశించిన వర్క్‌ అవర్స్ తర్వాత ఇంటికెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్లకు ఆఫీస్‌ పనితో సంబంధం ఉండదు. కానీ వర్క్‌ఫ్రమ్‌  ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది ఇంట్లో ఉన్నంత సేపు వర్క్‌లోనే గడిపేస్తున్నారు. 


వర్క్‌ టెన్షన్, ఫ్యామిలీతో ఫైట్‌


వర్క్‌ఫ్రమ్‌ హోం చాలా ఇళ్లల్లో చిన్న సైజు యుద్ధాలే జరుగుతున్నాయి. ఫ్యామిలీకి టైం ఇవ్వడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. టార్గెట్స్‌ వల్ల ఎక్కువ సమయం ల్యాప్‌టాప్‌పై గడిపేస్తున్నారు చాలామంది. 


చిన్నారుల్లో ఆందోళన


ఇలాంటి ఇంటిలో పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మానసికంగా వాళ్లు చాలా కుంగిపోతున్నారన్నది లేటెస్ట్ సర్వేలు చెబుతున్న కఠరో వాస్తవం. తాము అనుభవిస్తున్న ఇబ్బందిని బయటకు చెప్పుకోలేపోతున్న చిన్నారులు లోలోపలే కుంగిపోతున్నారని మానసిక శాస్త్రవేత్తలు వర్రీ అవుతున్నారు. 


ఇది జాతీయ విపత్తు


కరోనా తర్వాత చిన్నారుల్లో ఇలాంటి ఆందోళన ఎక్కువ అవుతోందని. ఇది జాతీయ విపత్తుగా పేర్కొంటున్నారు. దీన్ని అడ్రెస్ చేయకపోతే భవిష్యత్‌లో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులే అంటున్నాయి సర్వేలు. 


పిల్లలతో గడపలేకపోతున్న పేరెంట్స్


కరోనా కారణంగా చాలా మంది చిన్నారులు ఇప్పటికీ స్కూల్‌కు, ఆటలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు పెద్దలు వాళ్లతో టైం స్పెండ్ చేయడం లేదు. దీని కారణంగా పిల్లలు టీవీలకో, గాడ్జెట్స్‌కో అతుక్కుపోతున్నారు. గత రెండేళ్లుగా చిన్నారుల్లో మానసకి ఆందోళన తీవ్రమైందని సర్వేలు చెబుతున్నాయి.  వారిలో గందరగోళం, అయోమయం ఎక్కువ అవుతోంది. ఇది భవిష్యత్‌లో అతి పెద్ద ముప్పుగా పరిగణించే ప్రమాదంగా సైకాలజిస్టులు చెబుతున్నారు.


మన పిల్లల శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా దేశాభివృద్ధి చాలా అవసరం అన్న సంగతిని చాలా మంది విస్మరిస్తున్నారు. ఇదే చాలా విపరిణామాలకు దారి తీస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. 


53 శాతం వర్కింగ్‌ పేరెంట్స్‌కు తమ పిల్లల మెంటల్‌ హెల్త్‌పై కనీస అవగాహన లేదు. కనీసం నెలకు ఒక్కసారైనా పిల్లల మెంటల్‌ హెల్త్‌పై శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. 71శాతం మంది పని ఒత్తిడి కారణంగా పిల్లల మానసిక స్థితిపై ఫోకస్ చేయలేకపోతున్నట్టు చెప్పారు. 


ఏం చేయాలి


పిల్లలతో వీలైనంత ఎక్కువ టైం గడపడాలి.  స్కూల్‌లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. వర్క్‌ఫ్రమ్‌ హోం ఉన్నప్పుడూ కూడా వీకాఫ్‌లు తీసుకొని తమ పిల్లలతో గడపాలని సైకలాజిస్టులు సూచిస్తున్నారు. వాళ్లతో కలిసి భోజనం చేయాలని చెబుతున్నారు. వాళ్లతో గడిపే టైంలో గాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైతే వాళ్లతో ఆడుతూ గడపాలి.