Removal unwanted hair : అవాంఛిత రోమాల తొలగింపు కోసం షేవ్ చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా, బిరుసుగా మారుతాయని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. అండర్ ఆర్మ్స్, చేతులు, కాళ్లపై అవాంఛిత రోమాలను క్లీన్ చేయడానికి రేజర్లను ఉపయోగించకూడదని చాలా మంది సలహా ఇస్తూ ఉండటారు. అలా ఎందుకు చెబుతారు? అసలు అది సరైన విధానమేనా?
షేవింగ్ తో వెంట్రుకలు మందం అవుతాయా?
షేవింగ్ లేదా రేజర్ ఉపయోగించడం వల్ల వెంట్రుకలు బిరుసుగా మారుతాయి అనేది కేవలం అపోహ మాత్రమే. అవాంఛిత రోమాలను రేజర్‌తో తొలగించినప్పుడు, ఆ రోమాలు రూట్ తో సహా తొలగిపోవు. దాని మూలం అలాగే చర్మంలో ఉంటుంది. నిజానికి షేవింగ్ అనేది అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి అత్యంత చౌకైన, సులభమైన, నొప్పిలేని మార్గం. అయితే, షేవ్ చేయడం సురక్షితమేనా? చర్మం నల్లగా మారుతుందా? తిరిగి రోమాలు మందంగా పెరుగుతాయా? వంటి ఆందోళనలు మహిళల్లో కలగడం సహజమే. అయితే వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
షేవ్ చేసినప్పుడు తిరిగి రోమాలు పెరగడంతో చర్మంపై భాగం గరుకుగా మారినట్లు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. రేజర్‌ను పదే పదే ఉపయోగించినప్పుడు, వెంటుక మధ్య భాగం మాత్రమే మనం కత్తిరిస్తాం. ఈ కారణంగా రేజర్ ఉపయోగిస్తే మన చర్మం మందంగా మారింది అని భావిస్తుంటాం.
షేవ్ చేయకుండా జుట్టు పెరిగిన తర్వాత వ్యాక్స్ వాడినప్పుడు కూడా మీ జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. అందువల్ల, షేవింగ్ లేదా రేజర్ ఉపయోగించడం వల్ల రొమాలు ఒత్తుగా పెరుగుతాయి అనేది అపోహ మాత్రమే. అలాగే షేవింగ్ వల్ల రోమాలు వేగంగా పెరుగుతాయని అపోహ మాత్రమే.
షేవింగ్ వల్ల సమస్యలు:
అవాంఛిత రోమాలను తొలగించడానికి షేవింగ్ లేదా రేజర్‌ని ఉపయోగించినప్పుడు, ఒకటి లేదా రెండు రోజుల తర్వాత మీరు చర్మంలో కరుకుదనం, దురద సమస్యను ఎదుర్కోవచ్చు. ఈ సమస్యను నియంత్రించడానికి చర్మంపై మాయిశ్చరైజర్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు, ఆ ప్రాంతాన్ని ఆవ నూనె, కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి లేదా పడుకునే ముందు బాడీ లోషన్ రాయండి. ఇలా చేయడం వల్ల చర్మం త్వరగా నయమై జుట్టు మృదువుగా ఉంటుంది.
ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తులను షేవింగ్ తర్వాత చర్మంపై రాయకూడదని గుర్తుంచుకోండి. ఫంగస్ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి రేజర్‌ను శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఉంచండి. నిజానికి షేవింగ్ చేయడం వల్ల మీ చర్మం నల్లగా మారదు. వ్యాక్సింగ్ లేదా కెమికల్ ఉత్పత్తులను ఉపయోగించడంతో పోలిస్తే మీ శరీరంలోని అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి షేవింగ్ ఒక సురక్షితమైన మార్గం అని చెప్పవచ్చు.
Also Read : ఈ సింపుల్ జపనీస్ ట్రిక్స్‌తో బరువు ఈజీగా తగ్గిపోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.