మంచి ఆహారం తీసుకునే హాయిగా నిద్ర పడుతుంది. మనలో చాలా మందికి నిద్రపోయే ముందు పాలు తాగి పడుకోవడం అలవాటు. కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. కనీసం 8-10 గంటల పాటు నిద్రపోతేనే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. లేదంటే గుండె సమస్యలు, డిప్రెషన్, ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. అందుకే నిద్ర నాణ్యతను మెరుగు పరుచుకునేందుకు నిద్రవేళకు ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగడం అలవాటుగా ఉంది. ఇలా చేస్తే విశ్రాంతిని పెంపొందిస్తుంది. ఆందోళన తగ్గించి ప్రశాంతమైన నిద్రను ఇస్తుందని చాలా మంది నమ్ముతారు. కానీ అనేక అధ్యయనాల ప్రకారం నిద్రపోయే ముందు పాలు తాగడం ప్రయోజనాల కలిగించే దాని కంటే హాని ఎక్కువ చేస్తుందని చెబుతున్నాయి.


లాక్టోజ్ అసహనం


నైట్ టైమ్ పాలు తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. కొందరిలో కడుపు నొప్పి వస్తుంది. అందుకు కారణంలో పాలలో ఉండే లాక్టోస్. నేషనల్ డైజెస్టివ్ ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్ ప్రకారం దాదాపు 30-50 మిలియన్ల అమెరికన్లు లాక్టోస్ అసహనంతో బాధపడుతున్నారు. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, నొప్పులు, తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలను పెంచుతుంది.


గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి


లాక్టోస్ లేదా మిల్క్ అలర్జీ ఉన్నవారికి పాలలో చక్కెర కలిపితే తక్షణమే రక్తంలో చక్కెర పెరుగుదలకు దారి తీస్తుంది. అందుకే మధుమేహులు పాలకు దూరంగా ఉండాలి.


బరువు పెరుగుతారు


బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫుడ్ తగ్గించి పడుకునే ముందు పాలు తాగుతారు. ఇలా చేస్తే అనవసరమైన కేలరీలు నివారించవచ్చని అనుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పడుకునే ముందు తీసుకునే గ్లాసు పాలు బరువును పెంచుతాయి. ఒక గ్లాసు పాలలో 120 కేలరీలు ఉంటాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే జీవక్రియ మందగిస్తుంది. కేలరీలు బర్న్ చేయడానికి కొంచెం కఠినంగా ఉంటుంది.


అజీర్ణం


రాత్రి పూట పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. పాలు తాగిన వెంటనే పడుకుంటే జీర్ణక్రియ కష్టతరం చేస్తుంది. జీర్ణవ్యవస్థ రివర్స్ లో ప్రయాణించేలా చేస్తుంది. ఫలితంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ లేదా GERDకి కారణమవుతుంది. ఛాతీ నొప్పి, గుండెల్లో మంట, అసౌకర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రంతా నిద్ర పట్టకుండా మెలకువగా ఉంచుతుంది.


పాలు తాగడానికి ఉత్తమ సమయం ఇదే


నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం పాలు తాగడానికి ఉత్తమ సమయం నిద్రవేళకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు తాగొచ్చు. అది కూడా కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా పాలు తీసుకుంటే బాగా నిద్రపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పాలలో ట్రిప్టోఫాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెలటోనిన్‌ని పెంచి గాఢమైన, ప్రశాంతమైన నిద్రకు దారి తీస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కాలేయ పనితీరు సరిగా ఉండాలంటే ఈ ఆహారాలను దూరం పెట్టండి